Mana Enadu: సినీ ఇండస్ట్రీలో ‘బాహుబలి(Bahubali)’ చిత్రంతో వరల్డ్ వైడ్(WorldWide)గా తెలుగు సినిమా ఖ్యాతిని రెపరెపలాడించిన స్టార్ ‘ప్రభాస్(Prabhas)’. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా(Pan-India) జైత్రయాత్ర మొదలుపెట్టిన రెబల్ స్టార్.. సాహో(Sahoo), సలార్(Salar), కల్కి 2898AD సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఎల్లలు లేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. రికార్డు స్థాయిలో కలెక్షన్ల రికార్డుల్ని కొల్లగొడుతూ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రభాస్ దిగ్విజయ యాత్ర ఇండస్ట్రీలో ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని కాంక్షిస్తూ HAPPY BIRTH DAY ‘రెబల్ స్టార్’ ప్రభాస్.
సిక్స్ ఫీట్ హైట్.. సిక్స్ ప్యాక్ బాడీ
‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అనే డైలాగ్ ‘మిర్చి(Mirchi)’ సినిమాలో ప్రభాస్ కోసం కొరటాల శివ(Koratala Shiva) రాసిన డైలాగ్ ఇది. ఆయన ఏం అనుకున్నారో.. ఏం ఆలోచించి ఈ డైలాగ్ రాశాడోగానీ తెలీదు. కానీ ఈ డైలాగ్ ప్రభాస్‌కు సరిగ్గా సూట్ అవుతుంది. సిక్స్ ఫీట్ హైట్, సిక్స్ ప్యాక్ బాడీ..నేడు ఆయనకు ఎనలేని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. మాములుగా స్టార్ హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే కానీ రికార్డులు సాధ్యం కావు.. కానీ ప్రభాస్ విషయంలో అలా కాదు. ఈ పాన్ ఇండియా స్టార్‌కు హిట్టు, ప్లాపులతో సంబంధం లేదు. వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయంటే అభిమానుల్లో ప్రభాస్‌కు క్రేజ్ మాత్రమే.
ఫేమస్ డైలాగ్స్ గుర్తున్నాయా..
ప్రభాస్ నటించిన సినిమాల్లోని కొన్ని డైలాగ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. అభిమానుల్లోనూ ఎప్పటికీ చెరగని గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని డైలాగ్స్ మీకోసం..
* ‘శైలూ కోసం పదిసార్లు చస్తాను నేను, నువ్వు ఒక్కసారి చావగలవా.. నేను రెడీ..నువ్వు రెడీనా..?” – వర్షం
* వాడుపోతే వీడు, వీడుపోతే నేను, నేను పోతే నా అమ్మమొగుడంటూ ఎవరన్నా అధికారం కోసం ఎగబడితే… అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా.. గూండాయిజంతో వచ్చినా గ్రూపులు కట్టడానికి వచ్చినా.. రాజకీయంతో వచ్చినా రౌడీయిజంతో వచ్చినా పోటుకో శవం లెక్కన పోర్టుకి బలవుతాయి.. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయ్. – ఛత్రపతి
* ఏండీ ఏమన్నా మాట్లాడండే.. పోనీ ఓ పాట పాడండే. – బుజ్జిగాడు
* ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి, అంటే నేను నమ్మను.. మన దగ్గర మాటర్ ఉండాలి. Mr.పర్‌ఫెక్ట్
* వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. – మిర్చి
* ఏది మరణం.. మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం.. రణరంగంలో చావుకన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం. – బాహుబలి
* తప్పు చేసావ్ దేవసేన.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. తల. – బాహుబలి-2
* గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో సిక్స్ కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటది. – సాహో
* సలార్ సినిమా డైలాగ్స్ మొత్తం 2.35 నిమిషాల్లో చెప్పేశాడు. వీడియో ఇదిగో..
Prabhas Dialogue time in Salaar (sped up)
Roughly 4 minutes with dialogue gaps and 2:35 min without gaps… https://t.co/aHPhd30Mp5 pic.twitter.com/bxTclXjMcA— Lok (@TeluguOchu) January 21, 2024