ఇంటర్నేషనల్ వేదికపై ‘SSMB 29’ అప్డేట్.. క్రేజీ హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి

Mana Enadu : ‘గుంటూరు కారం’ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) తన నెక్స్ట్ ఫిల్మ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా గురించి చాలా రోజుల నుంచి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం తప్ప ఇతర ఏ అధికార అప్డేట్స్ రాలేదు. తాజాగా ఈ సినిమా గురించి  ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే?

SSMB 29పై జక్కన్న అప్డేట్ ఇదే

దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) ఇటీవల ఓ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహేశ్ బాబుతో సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ షేర్ చేసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ సినిమాలో కంటే ఎక్కువ జంతువులను తన తదుపరి చిత్రాల్లో చూపిస్తానని జక్కన్న వ్యాఖ్యానించడంతో ‘SSMB 29’లో రాజమౌళి జంతువులతో మంచి ఫైట్స్ సీన్స్ తెరకెక్కిస్తారని మహేశ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభం

ఇక ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ ఎపిసోడ్​లో వ్యాను బోనులో జంతువులను దించుతూ తారక్ ఎగిరే సీన్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పులులతో రామ్ చరణ్, ఎన్​టీఆర్ (NTR) పోరాడిన తీరుకూ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో తారక్ ఇంట్రో సీన్ కూడా అదుర్స్.

ఈ నేపథ్యంలో తాజాగా జక్కన్న చేసిన కామెంట్స్ తో మహేశ్ బాబు సినిమాపై ప్రేక్షకులకు మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని గతంలో రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) రీసెంట్​గా చెప్పిన విషయం తెలిసిందే. 

Share post:

లేటెస్ట్