మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. ఏజ్ పెరిగినా రోజురోజుకూ స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్నారు. అయితే ‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ చిరు.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే టాక్ మెగా ఫ్యాన్స్(Mega Fans)లో ఉందనేది కాదనలేని నిజం. ‘వాల్తేరు వీరయ్య(Valtheru Veeraya)’ మినహా తర్వాతి చిత్రాలేవీ ఆశించిన మేర సక్సెస్‌ను అందుకోలేకపోయాయి. ఆచార్య, భోళా శంకర్ ఫలితాలు చిరుతోపాటు ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేనివే. ఈ నేపథ్యంలో తన రాబోచే చిత్రాలపై మెగాస్టార్ కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారు. వశిష్ఠ(Vasishtha), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela), అనిల్ రావిపూడి(Anil Ravipudi) లాంటి యంగ్ డైరెక్టర్ల మూవీలను లైన్లో పెట్టాడు మెగాస్టార్.
చివరి దశలో విశ్వంభర షూటింగ్
ఇందులో బింబిసార ఫేమ్ వశిష్ఠ(Vasishtha)తో చేస్తున్న ‘విశ్వంభర(Vishvambhara)’ చివరి దశలో ఉంది. ఇక మిగతా రెండు చిత్రాలు ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తాయన్నదే తేలాల్సి ఉంది. శ్రీకాంత్ చిత్రమే ముందు అనౌన్స్ చేశారు కాబట్టి అదే మొదలవుతుందేమో అనుకున్నారు కానీ.. అది వాస్తవం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం నాని(Nani)తో ఓ సినిమా చేస్తున్న శ్రీకాంత్.. అది పూర్తయ్యాక చిరు సినిమాను ఆరంభించడానికి టైం పడుతుంది. ఈలోపు అనిల్ రావిపూడితోనే చిరు సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

అన్ని కుదిరితే అప్పుడే టీజర్
ఈ చిత్రం వచ్చే సంక్రాంతి(Sankranti)ని టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. అనిల్ స్క్రిప్టు, మేకింగ్ రెండింట్లోనూ చాలా ఫాస్టుగా ఉంటాడు. చిరు సినిమాను ఇంకో మూడు నెలల్లోనే అతను మొదలుపెట్టేయనున్నాడట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందే ఒక స్పెషల్ టీజర్(Special Teaser) రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మహా శివరాత్రి(Maha Shivaratri)కి ఈ టీజర్ లాంచ్ అవుతుందని సినీవర్గాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మరి దీనిపై అనిల్-చిరు జోడీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.








