Thandel Trailer: చైతూ ‘తండేల్’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), మలయాళ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్(Thandel)’. చందూ మొండేటి(Chandu Mondeti) డైరెక్ట్ చేస్తున్న అగ్ర నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీత ఆర్ట్స్ పతాకం మీద బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7న థియేటర్లలోకి రానుంది. తాజాగా తండేల్ ట్రైల‌ర్(Trailer) అప్‌డేట్‌ను ఇచ్చారు మేక‌ర్స్.

ప్రేమ కథ, దేశభక్తి అంశాలతో..

ఈ సినిమా ట్రైల‌ర్‌ను జ‌న‌వ‌రి 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌(Poster)ను విడుదల చేసింది. ‘‘Love for his country. Love for his people. Love for Satya’’ అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లిన నాగ చైతన్య‌ సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతాడు. అయితే పాకిస్థాన్ జైలు నుంచి అత‌డు ఎలా బయటపడ్డాడు అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. ఇక ఇందులోనే కొంచెం ప్రేమ కథ, దేశభక్తి అంశాలు జోడించి కమర్షియల్‌గా తెర‌కెక్కించాడు డైరెక్టర్ చందూ.

పాన్ ఇండియా లెవల్లో బజ్

దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘తండేల్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. పైగా కార్తికేయ2 సినిమాకు నేషనల్ అవార్డు(Nationa Award) రావడంతో చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా(Pan India) లెవల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్‌లు, గ్లింప్స్ ఆడియెన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన “హోలెస్సో.. హోలెస్సా” సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *