కుర్చీలు కోసం జెండాలు రేవంత్​రెడ్డి జెండాలు మార్చేస్తాడు

మన ఈనాడు:

కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి(Reventh Reddy). ఇంతకముందు రేవంత్ రెడ్డి TDPలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పారు. అప్పుడు సోనియా గాంధీని బలి దేవత అని చెప్పి ఇటలీ బొమ్మ అంటూ విమర్శలు చేశారు. నోటికి ఏదోస్తే అదే మాట్లాడాడు. ఇప్పుడు సోనియాగాంధీ దేవత అంటున్నారు. రేవంత్ నోటికి మొక్కాలి. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ వచ్చి నేను బీజేపీతో పోరాడుతా బీజేపీపై పోరాడే డీఎన్ఏ నాది అన్నారు. మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏ లు మ్యాచ్ కావట్లేదు. మేం ఎవ్వరికీ బీటీం కాదు మేం తెలంగాణ ప్రజల టీం. BRS, BJP ఎప్పటికి ఒకటి కాదు. నీళ్లు, నూనె ఎప్పుడైనా కలుస్తాయా ఇది కూడా అంతే. కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం లేదు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోవునా..?. పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం. వాళ్ళు గెలవగానే వీళ్ళను జైలుకు పంపిస్తారు. వీళ్ళు గెలవగానే వాళ్ళని జైలుకి పంపిస్తారు.” అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *