మన ఈనాడు:
ఎన్నికల వేళ రంగులు మార్చిన నాయకులపై తాండూరు MLA పైలెట్ రోహిత్ రెడ్డి రెచ్చిపోయారు. అమ్ముడు పోయిన నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను, పట్నం మహేందర్ రెడ్డి కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు.
పార్టీ మారిన బీఆర్ఎస్ నేతలపై తాండూరు MLA పైలెట్ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) నిప్పులు చెరిగారు. అమ్ముడు పోయిన కొడుకుల్లారా? ఖబర్దార్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కన్నతల్లి లాంటి బీఆర్ఎస్‌ను (BRS Party) మోసం చేయడానికి సిగ్గుండాలన్నారు. కొందరు పార్టీ వీడినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టం ఏమి లేదన్నారు. తాండూరు అభివృద్ధి కోసం తాను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరినట్లు చెప్పారు. తాను ఎలాంటి డబ్బులకు ఆశపడి పార్టీ మారలేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్నారు. ఫామ్‌హౌస్‌లో బేరం పెట్టినా తాను అమ్ముడుపోలేదని MLA రోహిత్‌రెడ్డి గుర్తు చేశారు.
దీన్ని ఓర్వలేకనే కొందరు నీచులు కుట్రలు పన్నుతున్నారన్నారు. అమ్ముడు పోయిన వారిని నిలదీయాలని నియోజకవర్గ ప్రజలకు రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. తాండూరుకు సంబంధంలేని కొంత మంది డబ్బుమూటలతో నియోజకవర్గంలో తిరుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. వారితో కొందరు ఇక్కడి నేతలు కలిసిపోయి తాండూరును తాకట్టు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.
కన్నతల్లిలాంటి పార్టీని తాను మోసం చేయనన్నారు. పార్టీ మారిన నేతలకు ముందుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అమ్ముడుపోతున్న వారిని తరిమి కొట్టాలని ప్రజలకు పిలపునిచ్చారు. తాండూరు అభివృద్ధి కోసమే తాను, మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కలిసిపోయామన్నారు.