మన ఈనాడు:
సూర్యాపేట నియోజవర్గం అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. సూర్యాపేట నుంచి విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుందనే ప్రచారం తెరమీదకి వచ్చింది.దీంతో BRS, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉండబోతున్నాయి.
అభివృద్ధి, సంక్షేమ పథకాలే మరోసారి అధికార పార్టీకి పట్టం కడుతాయని ధీమా వ్యక్తం చేస్తుంది. అభివృద్ధి పేరుతో అవినీతి తప్ప ప్రజలకు చేసేందేమి లేదని హస్తం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. 6గ్యారంటీలే హస్తం అభ్యర్థికి కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ప్రజా నాయకుడుగా, రైతుబిడ్డగా మాజీమంత్రిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. గతంలో 1999-2014 వరకు వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్డులే ఇక్కడ గెలిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరలేదు.
5967 ఓట్ల మెజార్టీతోనే కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్ రెడ్డి పై 2018లో BRS అభ్యర్ధి జగదీష్ రెడ్డి విజయం సాధించి మంత్రి అయ్యారు. ఈ సారి సూర్యాపేట నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే..ఆ పార్టీయే అధికారం చేపట్టబోతుందనే సెంట్ మెంట్ సైతం వినిపిస్తుంది.BRS మాత్రం మేము చేసిన అభివృద్ధి నలబై ఏళ్లలో ఎవరు చెప్పట్టని అభివృద్ధి చేశామని చెబుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించమని మరోమారు ప్రజలు BRS నే కోరుకుంటున్నారని అంటున్నారు.