మన ఈనాడు:
భాజపా అధిష్టానం ఇచ్చిన MLA అభ్యర్ధి స్థానాలను తిరస్కరించిన వివేక్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి, ధర్మపురి నుంచి వివేక్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది.
అందరూ అనుకున్నట్టుగానే వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డిలు బీజెపీలోంచి బయటకు వచ్చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. అంతేకాదు వీరిద్దరూ త్వరలో కాంగ్రెస్లో జాయిన్ అవుతారని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి, వివేక్ అనుకున్న స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారని అందుకే వారిద్దరూ ఆ పార్టీలో జాయిన్ అవనున్నారని అంటున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు అసెంబ్లీ సీట్లు కోరారని సమాచారం. ఎల్ బీ నగర్ , మునుగోడు అసెంబ్లీ స్థానాలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి తన భార్యను బరిలోకి దింపాలని రాజగోపాల్ రెడ్డి భావించారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానంనుండి పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి అనుకున్నారని సమాచారం. అయితే బీజెపీ అందుకు ఒప్పుకోలేదని దానివల్లనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తొలి జాబితాలో లేదని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అలాగే వివేక్ వెంకటస్వామి చెన్నూరు, ధర్మపురి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి నుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆయనకు చెన్నూరు అసెంబ్లీ కాకుండా ధర్మపురి అసెంబ్లీ స్థానం కావాలని వెంకటస్వామి కోరుకున్నట్టు సమాచారం. కానీ తొలి జాబితాలో ధర్మపురి అసెంబ్లీ స్థానం నుండి ఎస్. కుమార్ ను బీజేపీ బరిలోకి దింపింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి వివేక్ ధర్మపురి నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.