తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Sessions 2025) ఇవాళ కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో రాష్ట్రంలో సామాజికవర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రెండు చరిత్రాత్మక బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. బీసీ కోటాకు సంబంధించిన రెండు బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందు ఉంచారు.
ఇది గాంధీభవన్ కాదు శాసనసభ
అయితే సభ కొనసాగుతున్న సమయంలో మధ్యలోనే శాసనసభ నుంచి ఎంఐఎం సభ్యుల (MIM MLAs Walkout) వాకౌట్ చేశారు. శాసనసభ నడుపుతున్న తీరును నిరసిస్తూ ఎంఐఎం వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) ప్రభుత్వంపై మండిపడ్డారు. శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని శాసనసభలో ఖూనీ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది గాంధీభవన్ కాదు… తెలంగాణ శాసనసభ అని వ్యాఖ్యానించారు.






