ప్రస్తుతం టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి (MM Keeravani). దేవీశ్రీప్రసాద్, తమన్, అనిరుధ్ రవిచందర్ వంటి యంగ్ కంపోజర్లకు మాత్రమే ఇప్పుడు ఛాన్సులు వస్తున్నాయి. అయితే ఈ యంగ్ కంపోజర్లకు సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ సినిమాతో ఆస్కార్ గెలుచుకున్న ఆయన ఇప్పటికీ తన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళి తన ప్రతి సినిమాకు కీరవాణినే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటారన్న విషయం తెలిసిందే.
కీరవాణి మ్యూజికల్ కన్సర్ట్
ఇక ఈ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ యంగ్ కంపోజర్లకు పోటీనిస్తూ సంగీతం చేయడమే కాకుండా కన్సర్ట్ లను కూడా నిర్వహిస్తూ ఉంటారు. కీరవాణి సంగీత కచేరీలంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్ కు యూత్ మాత్రమే కాకుండా మధ్య వయస్కులు, వృద్ధులు కూడా ఫిదా అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కీరవాణి మ్యూజిక్ కన్సర్ట్ (MM Keeravani Musical Concert) నిర్వహించాలని నిర్ణయించారు.
View this post on Instagram
మార్చి 22న కీరవాణి కన్సర్ట్
హైదరాబాద్ టాకీస్ (Hyderabad Talkies), మై మ్యూజిక్ మై కంట్రీ సంయుక్తంగా ఈ సంగీత కచేరీని నిర్వహిస్తున్నాయి. మార్చి 22వ తేదీన హైటెక్స్‌లో ఇది జరగనుంది. తాజాగా ఈ మ్యూజికల్ కన్సర్ట్ ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆస్కార్ గెలిచిన తర్వాత కీరవాణి నిర్వహిస్తున్న కన్సర్ట్ ఇదే కావడం విశేషం. చాలా రోజుల తర్వాత కీరవాణి సంగీత కచేరి నిర్వహిస్తుండటంతో దీనికి హాజరవ్వాలని నెటిజన్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






