2025 మహా కుంభమేళలో సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేసిన తేనే కళ్ళ సుందరి మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ 16 ఏళ్ల యువతి, ప్రయాగ్‌రాజ్‌లో రుద్రాక్ష మాలలు, పూసల దండలు అమ్ముతూ కనిపించింది. కానీ ఆమె తేనె రంగు కళ్లతో, చిరునవ్వుతో, ఎంతో అందంతో ఒక నెటిజన్ తీసిన వీడియోలో కనిపించడంతో రాత్రికి రాత్రే ఓవర్‌నైట్ సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది.
సాధారణ జీవితం గడుపుతున్న మోనాలిసా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. అందంతో పాటు ఆమె కళ్లలో కనిపించే అమాయకత్వం నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఆమె వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్‌లో ఛాన్స్ కూడా కొట్టేసింది.
ఇటీవల ఆమె నటించిన ఒక మ్యూజిక్ వీడియో ‘సాద్గి’ యూట్యూబ్‌లో విడుదలయ్యి సంచలనంగా మారింది. ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి మోనాలిసా ఈ పాటలో మెరిసిపోయింది. ఎంబ్రాయిడరీ లెహంగా, క్లాసీ జ్యువెలరీతో ఆమె లుక్ స్టన్నింగ్‌గా ఉండటమే కాకుండా, ఆమె డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. నెటిజన్లు “హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గలే” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది.
ప్రస్తుతం మోనాలిసా ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న ఒక హిందీ సినిమాలో లీడ్ రోల్‌కి ఎంపికైంది. నటనలో మరింత నైపుణ్యం సాధించేందుకు ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటోంది. సినిమాతో వెండితెరపై మెరవబోతున్న ఈ అమ్మడు, ఆమె కలల్ని నిజం చేసుకుంటున్న మార్గంలో ముందుకు సాగుతోంది.






