ManaEnadu: స్మార్ట్ ఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్. మార్కెట్లోకి మరో హై ఫీచర్స్(High Features) ఉన్న మొబైల్ వచ్చేసింది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు ఈ మొబైల్‌లో ఉన్నాయని ఆ ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా(Motorola) పేర్కొంది. తాజాగా మోటరోలా నుంచి బడ్డెట్ స్మార్ట్ ఫోన్(Budget Smart Phone) సిరీస్ మరో సూపర్ మోడల్ లాంచ్ చేసింది. ఇండియాలో ఇది మరో వారం రోజుల్లోకి రానుంది. క్వాలిటీ స్మార్ట్ ఫోన్లు కస్టమర్లకు అందుబాటు ధరలో విక్రయించే మోటరోలా ఈసారి Motorola Edge 50Neo5G స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న మోటరోలా ఎడ్జ్ 50 సిరీస్ లో అదనంగా ఎడ్జ్ 50 నియో మోడల్స్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో IP68 వాటర్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి క్రేజీ ఫీచర్లు ఉండడం ఈ ఫోన్ స్పెషాలిటీ అని కంపెనీ పేర్కొంది.
ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్(Specifications) చూస్తే ఇలా ఉన్నాయి. 8GB RAM, 256GB స్టోరేజీతో ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది. దీని ధర రూ. 23,999. కస్టమర్లకు Edge 50 Neo 5G నాలుగు రంగుల వేరియంట్స్‌లలో అందుబాటులో ఉండనుంది. నాటికల్ బ్లూ, పోయిన్సియానా, లట్టే, గ్రిసైల్లె కలర్స్‌లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే.. మోటరోలా, ఫ్లిప్‌కార్ట్(Motorola, Flipkart) అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబరు 24 మధ్యాహ్నం నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయం ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, Motorola Edge 50 Neo 5G కొనుగోలుపై రూ. 1,000ల ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్(Bank discount) కూడా ప్రకటించింది.
ఈ కొత్త స్మార్ట్ ఫోన్.. MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 1.5K pOLED LTPO డిస్‌ప్లే ఉంది. ఇది గరిష్ఠంగా 3000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, HDR10+కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. దీన్ని మరింత ఎక్స్ ప్యాండ్ చేయవచ్చు. దీంతోపాటు అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ కోసం మోటరోలా ఎడ్జ్ 50 నియోలో ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్(Fingerprint sensor), ఫేస్ అన్ లాక్, వంటి సెక్యూర్ యాక్సెస్ ఫీచర్స్ ఉన్నాయి.
ఎడ్జ్ 50 నియోలో 4310mAh బ్యాటరీ ఉంటుంది. 50MP ప్రధాన షూటర్‌తో, నీటిలో కూడా స్పష్టమైన, స్థిరమైన షాట్‌లు తీయడానికి OIS సపోర్ట్ ఉంది. మిగతా రెండు కెమెరాలలో 13MP అల్ట్రా-వైడ్ షూటర్ 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ముందు భాగంలో.. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32MP కెమెరా అమర్చారు. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ నీటిలో మునిగిపోయినా ఎటువంటి నష్టం జరగదు. ఫోన్ జేబులో పెట్టుకొని నీళ్లలో దూకినా ఏ సమస్య రాదు. సో తరచూ నీటిలో ఉండే వారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది.