Credi Cards: కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా?

ManaEnadu: క్రెడిట్ కార్డు(Credi Card) అనేది రెండువైపులా పదునుండే కత్తివంటిది. అవసరానికి డబ్బు వాడుకున్నప్పుడు ఏ సమస్య ఉండదు కానీ, అప్పు తీర్చేటప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తుంది. అందుకే క్రెడిట్ కార్డును సమర్థవంతంగా వినియోగించే శక్తి మీకు ఉంటేనే తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తు(Future)లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకునేవారు ఎలాంటి క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి? దీనివల్ల లాభాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

 మీ లక్ష్యాలకు అనుకూలంగా ఉండేదే తీసుకోవాలి..

ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల సిఫార్సు మేరకు ఏదో ఒక క్రెడిట్ కార్డును ఎంచుకోకండి. మీకు ఎలాంటి కార్డు అవసరమో.. మీకు తెలిసి ఉండాలి. అందుకే మీ లక్ష్యాలకు అనుకూలంగా ఉండే క్రెడిట్ కార్డును తీసుకోవాలి. కొందరు ప్రొవైడర్లు(Providers) మీకు కార్డు గురించి సంపూర్ణ సమాచారం ఇవ్వకుండానే క్రెడిట్ కార్డును అందిస్తారు. తద్వారా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. వారు కొన్నిసార్లు రుసుము(Fee)లు ఉండవు, ఫ్రీ క్రెడిట్(Free Credit card) కార్డు అని చెప్పి క్రెడిట్ కార్డు తీసుకోమంటారు. తీరా తీసుకున్నాక రుసుములు విధిస్తారు. అందుకే అలాంటివారి మాటలు నమ్మొద్దు. దాదాపు అన్ని క్రెడిట్ కార్డులకు వార్షిక రుసుము(Annual Fee) ఉంటుంది.

 ఈ ప్రయోజనాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి

☛ క్రెడిట్ కార్డుల్లో రివార్డ్ పాయింట్(Reward point) కార్డులు, క్యాష్ బ్యాక్, ట్రావెల్, బిజినెస్, స్పోర్ట్స్(Sports) ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వాటిల్లో మీ అవసరాలకు ఏది తగినదో చూసుకొని అలాంటి క్రెడిట్ కార్డును తీసుకోవాలి.
☛ తక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డు తీసుకోవడం వల్ల.. ఆ పరిధిని మించి మీరు ఖర్చు పెట్టలేరు. ఇది మీ అనవసర ఖర్చుల్ని తగ్గిస్తుంది. మీరు మీ కార్డును సమర్థవంతంగా ఉపయోగిస్తే.. పరిధి పెంచుకోవచ్చు.
☛ తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకున్నవారు గడువు తేదీని మర్చిపోతుంటారు. అలా చేయకుండా.. గడువులోగా బిల్లు(Bill) చెల్లించాలి. లేకపోతే ఆలస్య రుసుములు చెల్లించాల్సి వస్తుంది.
☛ ఎక్కువ ఖర్చు చేయొద్దు అనుకొని.. అసలు క్రెడిట్ కార్డునే వినియోగించకపోవడం అస్సలు మంచిది కాదు. మీకు అవసరమున్న చోట కచ్చితంగా క్రెడిట్ కార్డును ఉపయోగించండి.
☛ ఆఫర్స్(Offers), రివార్డు పాయింట్స్ వస్తున్నాయి కదా అని మొత్తం డబ్బును ఖర్చు పెట్టకూడదు. ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్(Credit score) తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యూచర్‌లో మీకు డబ్బు అవసరం అయినప్పుడు ఇబ్బంది తలెత్తుతుంది.

Related Posts

Gold&Silver: తులం బంగారం రూ.90,000.. కిలో వెండి రూ.1,13,000

బంగారం ధరలు(Gold Rates) మళ్లీ షాకిచ్చాయి. నిన్న కాస్త తగ్గిన రేట్లు ఇవాళ ఆల్ టైం రికార్డు ధరకు చేరుకున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే పసిడి తులం రూ.లక్ష మార్కును చేరే అవకాశాలు ఉన్నాయని…

బాబోయ్ రూ.120 కోట్ల ట్సాక్స్.. బిగ్ బీ ఇన్‌కమ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు(Celebrities in the film Industry) ఏం చేసినా స్పెషలే. అందులోనూ పలువురు తమ నటనతోపాటు పలు ఆశ్చర్యకర విషయాలతో అభిమానుల్లో నిత్యం మెదులుతూనే ఉంటారు. అయితే నటీనటుల ఆస్తుల వివరాలు(Asset details of actors) మాత్రం బయటకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *