ManaEnadu:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) ప్రతి నెల బ్యాంకులకు సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. రెండు, నాలుగో శనివారం, ఆదివారాలు, పండుగలకు, ఇతర పబ్లిక్ హాలిడేలు ఇలా అన్ని కలిపి పూర్తి జాబితాను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్టోబర్ 2024 నెలకు సంబంధించి పూర్తి సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. ఈనెలలో 12 రోజులు సెలవులు ఉండటంతో ఆయా రోజుల్లో బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ (October)లో బ్యాంకు పనులు ఉన్న వారు ఈ జాబితాను చెక్ చేసుకుని తమ పనులకు సంబంధించి షెడ్యూల్ రెడీ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి రెండో తేదీన గాంధీ జయంతి (Gandhi Jayanti), ఆ తర్వాత బతుకమ్మ, దసరా పండుగలు, వెంటనే కర్వా చౌత్, ధంతేరస్, దీపావళి (Diwali) ఇలా వరుస సెలవులు వస్తున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శని, ఆది వారాలు కలిపి మొత్తం 12 రోజులు సెలవులు (Bank Holidays) వస్తున్నాయి. మరి అక్టోబర్లో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో చూద్దామా?
అక్టోబర్ నెలలో బ్యాంకులకు సెలవుల జాబితా ఇదే..
అక్టోబర్ 2వ తేదీన న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.అక్టోబర్ 3వ తేదీన నవరాత్రి వేడుకలు ప్రారంభం అలాగే మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.అక్టోబర్ 6వ తేదీన ఆదివారం బ్యాంకుల మూసివేత.అక్టోబర్ 10వ తేదీ మహా సప్తమి సందర్భంగా బ్యాంకులకు హాలీడే.అక్టోబర్ 11వ తేదీన మహానవమి సందర్భంగా మూసివేత.అక్టోబర్ 12వ తేదీన దసరా, రెండో శనివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.అక్టోబర్ 13వ తేదీన ఆదివారం కావడంతో సెలవు.అక్టోబర్ 17వ తేదీన కటి బిహు (అసోం), వాల్మీకి జయంతి కారణంగా బ్యాంకులకు హాలీడే.అక్టోబర్ 20వ తేదీన ఆదివారం సెలవు.అక్టోబర్ 26వ తేదీన విలీన దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో, నాల్గో శనివారం కారణంగా హాలీడే.అక్టోబర్ 27వ తేదీన ఆదివారం సెలవు.అక్టోబర్ 31వ తేదీన దీపావళి, సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భంగా సెలవు.