Amazon Sale : అమెజాన్‌ సేల్‌.. స్మార్ట్‌ ఫోన్లపై భారీ ఆఫర్లు

ManaEnadu : ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ (Amazon Great Indian Festival 2024) సెప్టెంబర్‌ 27వ తేదీన ప్రారంభం కానుంది. ప్రైమ్‌ మెంబర్లకుసెప్టెంబర్‌ 26నే ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. అయితే తాజాగా ఈ సంస్థ కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ను ప్రకటించింది. అందులో వన్‌ప్లస్‌, శాంసంగ్‌, యాపిల్‌, ఐకూ, రియల్‌మీ, షావోమీ, లావా, టెక్నో.. మొబైల్‌పై అందిస్తున్న ఆఫర్లను ప్రకటించింది.

ఐకూ జెడ్9 లైట్‌ 5జీ (iQOO Z9 Lite 5G) మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్లతో కలిపి రూ.9,499కే కొనుగోలు చేయొచ్చని అమెజాన్ పేర్కొంది. మరోవైపు కర్వ్‌డ్‌ స్క్రీన్‌ విభాగంలో తీసుకొచ్చిన ఐకూ జెడ్‌9 5జీ (iQOO Z9 5G) మొబైల రూ.15,999కు.. ఐకూ జెడ్‌7 ప్రో 5జీ (iQOO Z7 Pro 5G) మొబైల్‌ను రూ.19,749 కే కొనుక్కోవచ్చు. ఇక లావా బ్లేజ్‌3 5జీ (Lava Blaze 3 5G) ధర కేవలం రూ.9,899 మాత్రమే.

మరోవైపు క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌1 ప్రాసెసర్‌తో వచ్చిన వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ (OnePlus 11R 5G) ధర రూ.26,749 ఉండగా.. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 5జీ (OnePlus Nord CE 3 5G) ధర రూ.16,749గా ఉంది. ఇక పోకో ఫోన్లలో ఎక్స్‌6 5జీ (POCO X6 5G) మోడల్ రూ.14,999కే లభిస్తుండగా.. రియల్‌మీ నార్జో ఎన్‌63 (realme Narzo N63) రూ.7,155లకు వస్తోంది.

రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G) ధర రూ.9,199, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ (Samsung Galaxy S21 FE) ధర రూ.25,749, షావోమీ 14 (Xiaomi 14) ధర రూ.47,999లకే ఈ సేల్​లో కొనుగోలు చేయొచ్చు. మరోవైపు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, లేదా క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐ సదుపాయంతో చేసే కొనుగోళ్లపై 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఉంటుందని అమెజాన్ ప్రకటించింది.

 

Share post:

లేటెస్ట్