ManaEnadu : నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ గురించి మూడు నాలుగేళ్లుగా వార్తలు వస్తుండగా ఇటీవలే కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. హను-మాన్ ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఆయన తండ్రి బాలకృష్ణ (Balakrishna) తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఇటీవల అబుదబీ వేదికగా నిర్వహించిన ఐఫా అవార్డ్స్‌కు బాలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ హోస్టు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడగగా బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
డిసెంబరులో మోజ్ఞక్ష సినిమా
మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ (Prashant Varma) సినిమా డిసెంబరులో ప్రారంభం కానుందని బాలయ్య తెలిపారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. బాలయ్య కామెంట్స్ తో నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమా అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు బాలయ్య లేటెస్ట్ అప్డేట్ ఫుల్ కిక్ ఇచ్చింది.
సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో మూవీ
మరోవైపు ఈ సినిమా గురించి నెట్టింట పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందట. ఇక ప్రశాంత్ వర్మ సినిమాల్లో వీఎఫ్ఎక్స్ (VFX) గురించి తెలిసిందే. ఈ సినిమాలో కూడా భారీ వీఎఫెక్స్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయట. వినోదాత్మక కథనంతో పురాణాలను టచ్ చేస్తూ దీన్ని తెరకెక్కించనున్నట్లు నెట్టింట్లో టాక్ నడుస్తోంది.
మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య
ఇక ఈ మూవీలో కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోనున్నారట. ఇంకో క్రేజీ న్యూస్ ఏంటంటే.. ఈ చిత్రంలో బాలయ్య (Balakrishna) కేమియో ఉండనుందట. అది కూడా శ్రీకృష్ణుడి పాత్రలో నటించనున్నారట. ఎప్పుడెప్పుడు ఈ సినిమా గురించి అధికారికంగా అప్డేట్స్ వస్తాయా అని నందమూరి ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.