‘ఐఫా’ వేడుకల్లో ‘యానిమల్’ జోరు.. బెస్ట్ యాక్టర్ గా షారుక్‌

ManaEnadu :  భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (IIFA Utsavam 2024) (IIFA Awards) అవార్డుల కార్యక్రమం అబుదబీ వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలిరోజు దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు, సినీ ప్రముఖులకు అవార్డులు అందుకోగా.. రెండో రోజు బాలీవుడ్‌ సినిమాలకు, నటీనటులకు అవార్డులు ప్రదానం చేశారు. ఇక ఐఫా వేడుకల్లో కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ (Tollywood), మాలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన సినీ తారలు పాల్గొన్నారు. పలువురు నటీనటులు తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.

ఇక ఐఫా వేడుకల్లో హిందీ పరిశ్రమ నుంచి ‘యానిమల్‌’ (Animal) తన హవా చూపించింది. వివిధ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ‘జవాన్‌’ (Jawan) సినిమాకు గానూ షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)  ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకోగా.. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాకు ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ఐఫా అవార్డు అందుకున్నారు.

ఐఫా 2024 బాలీవుడ్ విజేతలు వీరే:

ఉత్తమ చిత్రం: యానిమల్‌
ఉత్తమ నటుడు: షారుక్‌ ఖాన్‌ (జవాన్‌)
ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే)
ఉత్తమ దర్శకుడు: విదు వినోద్‌ చోప్రా (12th Fail)
ఉత్తమ సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ )
ఉత్తమ విలన్‌: బాబీ దేవోల్‌ (యానిమల్‌)
ఉత్తమ కథ: రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ
ఉత్తమ కథ (Adapted): 12th ఫెయిల్‌
ఉత్తమ సంగీతం: యానిమల్‌ 
ఉత్తమ లిరికల్స్‌: యానిమల్‌ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)
ఉత్తమ గాయకుడు: భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్‌)
ఉత్తమ గాయని: శిల్పారావు (చెలియా-జవాన్‌)
ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా: జయంతిలాల్‌, హేమా మాలిని
అచీవ్‌మెంట్ ఆన్‌ కంప్లీటింగ్‌ 25 ఇయర్స్‌ ఇన్‌ సినిమా : కరణ్‌ జోహార్‌

Related Posts

దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు (Hyderabad IT Raids) కలకలం రేపుతున్నాయి. నగరంలోని రెండు సంస్థలపై ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల దాడులు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన దిల్‌రాజు (Dil Raju)…

బాక్సాఫీస్ వద్ద ‘డాకు మహారాజ్’ హవా.. రూ.150 కోట్లు వసూల్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లతో ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *