ManaEnadu: శివ కోటటాల(Koratala Shiva) డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR) నటించిన మూవీ దేవర(Devara). ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా SEP 27న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ మూవీపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్(Pre-Release Event)పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతోంది. దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు టీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
వర్షసూచనతోనే ఆ నిర్ణయం
ఇదిలా ఉండగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ నోవాటెల్ హోటల్(Novotel, Hyderabad)లో ఈ ప్రోగ్రామ్ ఉండే ఛాన్స్ ఉందని మరో న్యూస్ వైరల్ అవుతోంది. పబ్లిక్ ఈవెంట్ కోసం ప్రయత్నించినా ఆ వారంలో వర్షసూచన(Rain Alert) ఉండటంతో వెనక్కి తగ్గినట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినబడుతోంది. దీంతో మూవీ టీమ్ ఇన్‌డోర్లోనే దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చూస్తోందట. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్(Official Announcement) రాలేదు. అలాగే దీనికోసం వచ్చే అతిథులపై కూడా క్లారిటీ రాలేదు. కాగా ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) విలన్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న “దేవర: పార్ట్ 1(Devara: Part 1)” ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
After a Disaster Like #Acharya Still #KoratalaShiva gets a Remuneration of 30 CRORES for #Devara 😳😳😳💥💥💥
One More #NTR’s – #Devara Team Doing Very Good Promotions Like Song Releases Trailer Event and Pressmeets going on but Still some People Questioning the Promotions ✅ pic.twitter.com/w1AUYuAH23
— GetsCinema (@GetsCinema) September 17, 2024
భారీ మొత్తంలో కొరటాల రెమ్యునరేషన్
మరోవైపు దేవర మూవీ కోసం డైరెక్టర్ కొరటాల శివ(Director Koratala Siva) భారీ రేంజ్‌లో రెమ్యునరేషన్(Remuneration) అందుకున్నట్లు తెలుస్తోంది. సినీ సర్కిల్ నుంచి వచ్చిన సమాచారం మేరకు కొరటాల శివ రూ.30 కోట్లు ఛార్జ్ చేశారట. చిరంజీవితో చేసిన ఆచార్య ఫెయిల్ అయినా ఈ సినిమాతో హై సక్సెస్ సాధిస్తారనే నమ్మకంతో ఉన్నారు కొరటాల. దానికి తోడు NTR వంటి స్టార్ హీరోని డైరక్ట్ చేస్తుండటంతో ఈ మొత్తం తీసుకున్నట్లు చెప్తున్నారు. అందుకు తగ్గట్లే దేవరకు బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. కాగా ఈ హైఓల్టేజ్ యాక్షన్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.