ManaEnadu:టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లు అదరగొడతాయి. ఈ సీజన్లలో పెద్దపెద్ద సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ కొడతాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ బద్ధలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దసరా వంతు వచ్చింది. ఈ సంవత్సరం దసరా పండుగకు బాక్సాఫీస్‌ను షేక్ ఆడించడానికి సినిమాలు రెడీ అయ్యాయి. నాలుగు తెలుగు సినిమాలు, ఒక తమిళ్ మూవీ ఈ లిస్టులో ఉంది. అయితే ఈ నాలుగు తెలుగు సినిమాల్లో ఒక్కటి కూడా స్టార్ హీరోలు, సీనియర్ నటులది లేకపోవడం గమనార్హం. మరి ఆ సినిమాలేంటో చూద్దామా?
స్వాగ్తో శ్రీవిష్ణు
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి తెలిసిందే. సినిమాలు ఎంచుకోవడంలో ఈయన రూటే సపరేటు. కామెడీ, ఎమోషన్‌ను ఈ హీరో తెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. శ్రీవిష్ణు(Sri Vishnu) చిత్రం అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. అలా ఈ ఏడాది దసరా పండుగకు ఈ యంగ్ హీరో ‘స్వాగ్ (Swag Movie)’ చిత్రంతో అక్టోబరు 4న థియేటర్లలోకి వస్తున్నాడు. ‘సామజవరగమన’, ‘ఓం భీం బుష్’ సూపర్ హిట్స్ తర్వాత స్వాగ్తో హ్యాట్రిక్‌కు ట్రై చేస్తున్నాడు. రాజ రాజ చోర ఫేం డైరెక్టర్ హసిత్ గోలి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది.
గోపీచంద్- శ్రీనువైట్ల మూవీ
చాలా కాలం నుంచి నటుడు గోపీచంద్ (Gopichand)కు సరైన హిట్ పడలేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా ఈయనకు పెద్దగా కలిసి రావడం లేదు. ఇక తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ‘విశ్వం( Viswam Movie)’ సినిమాతో గోపీచంద్ రాబోతున్నాడు. అక్టోబరు 11న ఈ సినిమా విడుదల కాబోతోంది.
సుధీర్ బాబు ఫాదర్ సెంటిమెంట్
మా నాన్న సూపర్ హీరో (Ma Nanna Hero) చిత్రంతో రానున్నాడు సుధీర్ బాబు. అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. తండ్రీకొడుకుల అనుబంధం కథతో ఈ సినిమా తెరకెక్కింది. గత కొంతకాలంగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సుధీర్ బాబు (Sudheer Babu)కు ఈ ఫాదర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
జనక అయితే గనక
అంబాజీ పేట బ్యాండ్, ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకులను అలరించిన నటుడు సుహాస్(Suhas). దసరా బరిలో ఈ యంగ్ నటుడు కూడా ఉన్నాడు. జనక అయితే గనక ( Janaka Aithe Ganaka) సినిమాతో ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద తన హవా చూపించనున్నాడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న ఈ సినిమాను సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. అక్టోబరు 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.
దసరా బరిలో తలైవా
దసరా బరిలో తెలుగు స్టార్ హీరోలు ఎవరు లేకున్నా, తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth) బరిలోకి దిగుతున్నారు. వేట్టయాన్ (Vettaiyan) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఇచ్చేందుకు వస్తున్నారు. జై భీమ్ ఫేం టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబరు 10న ఈ సినిమా రానుంది.