రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. నిజం ఒప్పుకున్న జానీ మాస్టర్?

ManaEnadu: మహిళా కొరియోగ్రాఫర్‌(female choreographer)పై జానీ మాస్టర్(Jony Master) లైంగిక వేధింపుల కేసులో కీలక విషయాలు బయటికొచ్చాయి. ఈ మేరకు రిమాండ్ రిపోర్టు(Remand Report)లో పొందుపర్చిన వివరాలను నార్సింగి పోలీసులు వివరించారు. విచారణలో జానీ మాస్టర్ నిజాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా నిన్న గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈరోజు హైదరాబాదులోని ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్(Judicial remand) విధించింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు.

 దురుద్దేశంతోనే జానీ మాస్టర్ అలా చేశాడు: పోలీసులు

ఈ సందర్భంగా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో నార్సింగి పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించినట్లు తెలిపారు. 2019లో జానీ మాస్టర్‌తో బాధితురాలి(victim)కి పరిచయమైనట్లు తెలిపారు. దురుద్దేశంతో(With malice)నే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌(assistant)గా చేర్చుకున్నట్లు వెల్లడించారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో ఆమెపై లైంగిక దాడికి(sexual assault) పాల్పడినట్లు పేర్కొన్నారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయస్సు కేవలం 16 మాత్రమే అని తెలిపారు. నాలుగేళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడన్నారు. లైంగిక దాడి విషయం బయటకు రాకుండా జానీ ఆమెను బెదిరించాడన్నారు(Threatened). ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని, కోర్టు(Court)లో నిజానిజాలు తేలుతాయని జానీ మాస్టర్‌ భార్య అయేషా(Ayesha) అలియాస్‌ సుమలత అన్నారు.

నిజాయతీ నిరూపించుకొని బయటికి వస్తా: జానీ మాస్టర్

అంతకు ముందు కోర్టు ఆవరణలో జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడారు. కావాలనే తనను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కడిగిన ముత్యంలా నిజాయితీ(Sincerely)గా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని జానీ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్(Jony Master Strong Warning) ఇచ్చారు. కావాలనే కొందరు తనపై తప్పుడు కేసు పెట్టించారని, న్యాయపోరాటం చేసి బయటకు వస్తానన్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *