ANR National Award 2024: బిగ్‌బీ చేతుల మీదుగా మెగాస్టార్‌కు ANR అవార్డు.. ప్రకటించిన నాగ్

ManaEnadu: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chirangeevi).. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మెగాస్టార్‌గా ఎదిగిన వ్యక్తి ఆయన. చిరు జీవితం వడ్డించిన విస్తరికాదు. మొదట్లో ఎన్నో ఒడిదుడికులు, మరెన్నో విమర్శలు. వాటికి కుంగిపోకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా.. ఒక్కో నిచ్చెన ఎక్కుతూ తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu film industry)లో మెగాస్టార్‌గా ఎదిగారు. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. స్వయంకృషి, స్వీయ ప్రతిభే ఆయన కెరీర్‌కు పునాది రాళ్లు. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత. బాక్సాఫీసు రికార్డులు(Records) సృష్టించిన మగధీరుడు. అశేష అభిమానులకు ఆయన మెగాస్టార్. ఆయన నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇటీవల 45ఏళ్లు(45 years) కూడా పూర్తి చేసుకున్నారు. ఈ నటనా ప్రతిభకు ఎన్నో పురస్కారాలు(Awards) ఆయనకు దాసోహమన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్(Padmavibhushan) అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందామా…

 నటనతోపాటు ఎన్నో సేవా కార్యక్రమాలు

చిరంజీవి(Chiranjeevi) కేవలం సినీ పరిశ్రమలోనే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు(Service programs) కొనసాగిస్తున్నారు. ప్రజలు ఏ ఆపదలో ఉన్నా సరే నేనున్నాంటూ ముందుకొస్తుంటారు. ఈనేపథ్యంలో ఆయన మరో పురస్కారం అందుకోబోతున్నారు. తెలుగులో తొలి తరం అగ్ర హీరోలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఇచ్చే పురస్కారం మెగాస్టార్‌ని వరించనుంది. అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao) పేరిట ఏటా ఆయన కుటుంబం అవార్డు ఇవ్వడం ఆనవాయితీ. ఈ మధ్య రెండేళ్లకు ఒకసారి ఆ అవార్డు ఇస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని వివిధ భాషల్లో చిత్రసీమ ఉన్నతికి కృషి చేసిన ప్రముఖులకు ఇస్తారు. ప్రతి ఏడాది ఇచ్చే అవార్డుతో పోలిస్తే ఈ ఏడాది అవార్డుకు కాస్త ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే.. అక్కినేని శత జయంతి(centenary) సంవత్సరంలో ఇస్తున్న అవార్డు ఇది.

 చిరూ చాలా ఎమోషనల్ అయ్యారు: నాగ్

మెగాస్టార్ చిరంజీవిని ఈ ఏడాది అక్కినేని అవార్డు (ANR Award 2024)తో సత్కారం చేస్తున్నామని ఆయన వందో జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) అనౌన్స్ చేశారు. అవార్డు గురించి చెప్పగానే చిరంజీవి చాలా ఎమోషనల్(Emotional) అయ్యారని, తనను హగ్ చేసుకుని థాంక్స్ చెప్పారని ఆయన వివరించారు. టాలీవుడ్(Tpllywood) సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ANR శతజయంతి వేడుకలు RK సినీ ప్లెక్సీలో జరుగుతున్నాయి. అక్టోబర్ 28న ANR Award ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని నాగార్జున తెలిపారు. ఇవాళ (SEP 20) ఆయన జయంతి సందర్భంగా చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు(Akkineni National Award)ను ప్రకటించారు. జాతీయ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్(Bollywood) సీనియర్ హీరో అమితాబచ్చన్(Amita Bachchan) హాజరు కానున్నారు. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు Director కే.రాఘవేంద్రరావు(K. Raghavendra Rao) పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్