Jr.NTRs Devara: ‘దేవర’కు గుడ్‌న్యూస్.. టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ గ్రీన్‌సిగ్నల్

ManaEnadu: నందమూరి స్టార్ హీరో, జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), కొరటాల శివ(Koratala Shive) కాంబోలో వస్తోన్న మూవీ దేవర: పార్ట్ 1(Devara). ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా SEP 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ, అలనాటి దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటించారు. మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఈ మూవీపై అదే హైప్ కొనసాగుతో వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన “చుట్టమల్లే సాంగ్” యూట్యూబ్‌(Youtube)ను షేక్ చేసింది. అటు ట్రైలర్ సైతం మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.. ఆదివారం (సెప్టెంబర్ 22న) దేవర ప్రీరిలీజ్ ఈవెంట్‌(Prerelease event)ను కూడా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌(Novatel Hotel)లో దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నట్లు మూవీ టీం ప్రకటించేసింది. అంతేకాదు ఈ ఈవెంట్‌లో మేకర్స్ ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

 తొలిరోజు 6, మిగతా 9 రోజుల పాటు 5 షోలు

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం NTR అభిమానులకు శుభవార్త చెప్పింది. సాధారణంగా ప్రధాన హీరోల సినిమాల రిలీజ్ టైమ్‌లో ప్రీమియర్‌ షోస్(Premier shows) ప్రదర్శిస్తుంటారు. అదే విధంగా ఫస్ట్ వీక్ టికెట్‌(Ticket Rates)) ధరల పెంపునకు కూడా ఆయా ప్రభుత్వాలు అనుమతిని ఇస్తుంటాయి. ఈ మేరకు ‘దేవర’ మూవీ టీమ్ కూడా AP ప్రభుత్వాన్ని కలిసి స్పెషల్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు పర్మిషన్‌కు అప్లై చేశారు. అందుకు అధికారులు సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేశారు. దేవర సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. APలోని అన్ని సినిమా హాళ్లలో బాల్కనీ టికెట్ ధర రూ.110 కి, దిగువ క్లాస్ టికెట్ ధరలు రూ.60 మేర పెంచుకుందుకు అనుమతి మంజూరు చేశారు. మొత్తం 9రోజుల పాటు స్పెషల్‌ షోలు ప్రదర్శనకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఫస్ట్ డే అర్ధరాత్రి 1 గంటలకి షో వేయనున్నారు. అలాగే ప్రధాన హాల్స్‌లో తొలిరోజు ఆరు ఆటలను, మిగతా 9 రోజుల పాటు 5 షోలను ప్రదర్శించనున్నారు.

 ఏపీ ప్రభుత్వానికి చాలా థాంక్స్: NTR

ఈ సందర్భంగా దేవర మూవీ రిలీజ్‌ను ప్రోత్సహించిన AP ప్రభుత్వానికి Jr. NTR ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవర(Devara) చిత్ర విడుదల కోసం AP Govt కొత్త G.Oను విడుదల చేసిందని ఆయన తెలిపారు. CM చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు థాంక్స్ చెప్పారు. AP ప్రభుత్వం తెలుగు సినిమాకు తన మద్దతును ఇలాగే కొనసాగించాలని NTR ఆకాంక్షించారు.

Share post:

లేటెస్ట్