జనం పొటెత్తారు..దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

ManaEnadu:టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా, అలాగే సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న దేవర ఈ నెల సెప్టెంబర్27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మం చేశారు .

 హైదరాబాద్‌ హైటెక్స్‌లోని నోవాటెల్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ కేవలం 5వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉంది. కానీ పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సుమారు 15 వేలకు మంది పైగానే అభిమానులు చొచ్చుకుని వచ్చారు. పోలీసులు నిలువరించినా ఫలితం లేకపోయింది. దీంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్గనైజర్స్.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దేవర సినిమాను నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన స్వరాలు ఇప్పటికే సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్నచిత్రం కావడంతో దేవరపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి.

Share post:

లేటెస్ట్