Dhoom 4 : బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీలో విలన్‌గా సూర్య?

ManaEnadu:బాలీవుడ్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ ఫ్రాంఛైజీలో కచ్చితంగా ‘ధూమ్‌’ (Dhoom) సిరీస్ ఉంటుంది. ఈ ఫ్రాంఛైజీకి హిందీలోనే కాదు యావత్ ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారు. భారతీయ యాక్షన్‌ ఫిల్మ్స్‌లో ధూమ్ సిరీస్​కు ఉన్న క్రేజే వేరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సిరీస్​ను ఇష్టపడుతుంటారు. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీలో మూడు సినిమాలు వచ్చాయి.

2004లో ధూమ్​, ఆ తర్వాత ధూమ్-2, ధూమ్-3 (Dhoom 3) ప్రేక్షకులను అలరించాయి. బాక్సాఫీస్‌ వద్ద అవన్నీ సూపర్‌ హిట్స్‌ అందుకున్నాయి. ఈ ఫ్రాంఛైజీలోనే త్వరలో ‘ధూమ్‌ 4’ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఈ ఫ్రాంఛైజీ ప్రొడక్షన్ కంపెనీ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ (Yash Raj Films) ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.

ఇక ‘ధూమ్‌, పార్ట్‌ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే ‘ధూమ్‌ 4 (Dhoom 4)’కు కూడా కథ అందించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సినిమాల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మరోవైపు సాదాసీదా యాక్షన్ ఫిల్మ్స్​ను ప్రేక్షకులు రుచించరు. అందుకే ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు దక్కట్టుగా ఈ సినిమాను గ్రాండ్​గా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారట ఆదిత్య చోప్రా (Adithya Chopra).

అయితే ధూమ్-4కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీక్వెల్​లో కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య (Suriya) కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ సినిమాలో ముఖ్యమైన విలన్ రోల్​లో నటించనున్నట్లు టాక్. ఇప్పటికే మేకర్స్ సూర్యను ఈ విషయమైన సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించారట.

ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్ భలే ఆనంద పడుతున్నారు. ఈ సీక్వెల్​లో యాక్ట్‌ చేస్తే ఈ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుందని అంటున్నారు. నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రల్లో యాక్ట్‌ చేయడం సూర్యకు కొత్త ఏమీ కాదు. ‘24’, ‘విక్రమ్‌’ సినిమాల్లో విలన్​గా నటించి మెప్పించారు. ముఖ్యంగా కమల్ హాసన్ లీడ్ రోల్​లో వచ్చిన ‘విక్రమ్‌’ మూవీ రోలెక్స్‌ (Rolex) పాత్రలో సూర్య అదరగొట్టాడు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *