ManaEnadu : గత రెండు మూడు నెలలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. కానీ దసరా పండగ (Dussehra Festival)కు ముందు బ్లాక్ బస్టర్ చిత్రాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఇటు థియేటర్ దద్దరిల్లేలా.. అటు ఓటీటీ ఊగిపోయేలా క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ప్రేక్షకులను మైమరిపించే సినిమాలేంటో ఓ లుక్కేద్దామా
థియేటర్ లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
Devara : ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర (Devara). కొరటాల శివ (Koratala Shiva) తెరకెక్కించిన ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. దేవర పార్ట్-1 సెప్టెంబరు 27వ తేదీన రిలీజ్ కాబోతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
Satyam Sundaram: తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు కార్తి (karthi). తమిళంలో ‘96’ వంటి ఫీల్ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తి నటిస్తున్న మూవీ ‘మెయ్యజగన్’ తెలుగులో సత్యం సుందరం పేరుతో తెరకెక్కింది. అరవింద స్వామి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 28న (meiyazhagan release date) విడుదల కాబోతోంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మరికొన్ని చిత్రాలు సిరీస్‌లు..
జీ5
‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) సెప్టెంబరు 27
లవ్ సితార (హిందీ) సెప్టెంబరు 27
నెట్‌ఫ్లిక్స్
సరిపోదా శనివారం (Saripodha Shanivaram) సెప్టెంబరు 26
పెనెలోప్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 24
హెవెన్ అండ్ హెల్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 26
ది ట్రూ జెంటిల్‌మెన్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 26
రెజ్‌బాల్ (హాలీవుడ్) సెప్టెంబరు 27
విల్ అండ్ హార్పర్ (హాలీవుడ్) సెప్టెంబరు 27
అమెజాన్ ప్రైమ్ వీడియో
స్కూల్ ఫ్రెండ్స్(హిందీ సిరీస్) సెప్టెంబరు 25
నోబడీ వాంట్స్ దిస్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 26
స్త్రీ2 (హిందీ) సెప్టెంబరు 27
డిస్నీ+హాట్‌స్టార్
వాళ (మలయాళం) సెప్టెంబరు 23
9-1-1 (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 24
గ్రోటీ స్క్వేర్ (హాలీవుడ్) సెప్టెంబరు 26
తాజా ఖబర్2 (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 27