The Goat Video Song: యూట్యూబ్‌లోకి వచ్చేసిన వీడియో సాంగ్.. మాస్ స్టెప్పులతో అలరించిన త్రిష

ManaEnadu: త్రిష కృష్ణన్ (Trisha Krishnan).. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకుందీ హీరోయిన్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. అయితే యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే ఆమె ఇటీవల మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోంది. పొన్నియన్ సెల్వం(Ponnian Selvan) రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ది గోట్(The Goat) చిత్రంలోనూ ఓ ఐటెమ్ సాంగ్‌(Item song)లో అలరించారు. తన మాస్ స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించింది ఈ సినీయర్ బ్యూటీ.

తాజాగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Dalapati Vijay) హీరోగా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ (The Goat) సినిమా నుంచి ఓ పాట వీడియో(Video Song) ఫుల్‍గా వచ్చేసింది. మూవీకి హైలైట్‍గా నిలిచిన స్పెషల్ సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు దళపతి విజయ్, త్రిష ఫుల్ జోష్‍తో స్టెప్స్ వేశారు. ముఖ్యంగా చీరకట్టులో త్రిష లుక్, డ్యాన్స్ విపరీతంగా మెప్పించింది.

 భారీ ఓపెనింగ్స్ దక్కినా..

అయితే SEP 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. భారీ ఓపెనింగ్ దక్కినా.. ఆ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా(Yuvan Shankar Raja) జోష్ ఉండే ట్యూన్ ఇచ్చారు. ది గోట్ చిత్రంలో దళపతి విజయ్ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్‍గా నటించారు. వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్ చేశారు.

 ఓటీటీలోకి వచ్చేదెప్పుండటే

ది గోట్ చిత్రం OTT రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్(Netflix) ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. భారీ ధరకు ఈ మూవీని తీసుకుంది. ది గోట్ చిత్రం OCT 3 లేకపోతే OCT 11న నెట్‍ఫ్లిక్స్ OTTలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే రూమర్లు ఉన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *