ManaEnadu: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Devara Pre Release Event) రద్దు కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈ ఈవెంట్ ఆర్గనైజర్లపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన శ్రేయాస్ మీడియా (Shreyas Media) ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ ఈవెంట్ రద్దు కావడం దురదృష్టకరమంటూ కార్యక్రమం కోసం వాళ్లు చేసిన ఏర్పాట్ల వివరాలను తెలుపుతూ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టింది.
వీ ఆర్ వెరీ సారీ
‘‘ఎన్టీఆర్‌పై (NTR) మీ అందరికీ ఉన్న అపారమైన అభిమానాన్ని మేం అర్థం చేసుకున్నాం. ఆరేళ్ల తర్వాత ఆయన తెరపై కనబడబోతున్నందున మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందుకే తాజాగా జరిగిన పరిణామంతో నిరుత్సాహానికి గురయ్యారు. మీకు జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా మా క్షమాపణలు. ఎన్టీఆర్ ఫ్యాన్డమ్ను దృష్టిలో ఉంచుకుని ఈవెంట్ను భారీ బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ గణేశ్ నిమజ్జనం (Ganesh Immersion), వర్షాల కారణంగా ఈవెంట్ వేదికను హోటల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
అదంతా అబద్ధం
అయితే ఈవెంట్ (Devara Release)కు పరిమితులకు మించి పాస్‌లు ఇచ్చామంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తి అబద్ధం. మేం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 35వేల మంది అభిమానులు వచ్చారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనం రావడం, బారికేడ్లు పగులగొట్టం వంటి కారణాలతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఇక పరిస్థితులు చేయి దాటడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చింది. గతంలో మా ఆర్గనైజేషన్ 2 లక్షల మంది హాజరైన ఈవెంట్లను కూడా ఎలాంటి ఇబ్బందిలేకుండా నిర్వహించిన విషయం మీక్కూడా తెలిసిందే.
మీ సపోర్టు ఎప్పటికీ ఇలా ఉండాలి
ఈ ఈవెంట్ కోసం చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు. మిమ్మల్ని నిరాశ పరిచినందుకు మమ్మల్ని క్షమించండి. ఎన్టీఆర్ (NTR Devara)పై మీకున్న అచంచలమైన సపోర్టు ఆయన్ను ఈ స్థాయిలో ఉంచాయి. ఆదివారం రాత్రి మరోసారి ఆయనపై మీ అభిమానాన్ని ప్రపంచానికి చాటారు. ఈ పరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మమ్మల్ని మీరు ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని తెలుపుతూ శ్రేయాస్ మీడియా సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…