ఆమె మాటే నిజమైంది.. 2025 ఆస్కార్‌కు ‘లాపతా లేడీస్’

Mana Enadu: బాలీవుడ్లో ఇటీవల విడుదలైన సినిమాల్లో క్లాసిక్ హిట్గా నిలిచింది ‘లాపతా లేడీస్(laapataa ladies)’. 2001 కాలంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన ఇతివృత్తంగా ‘లాపతా లేడీస్‌’ను దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించారు. ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఎన్నో ప్రశంసలు అందుకుంది.

ఆస్కార్ కు ఎంట్రీ

ఇక తాజాగా లాపతా లేడీస్ మూవీ ఇప్పుడు భారత్‌ తరఫున అధికారికంగా ఆస్కార్ (Oscar) ఎంట్రీకి పంపిస్తున్నట్టు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (Film Federation Of India) ప్రకటించింది. అయితే ‘ఆట్టం’, ‘యానిమల్‌’ తదితర 29 సినిమాల లిస్టు నుంచి ఈ సినిమాను ఎంచుకున్నట్లు తెలిపింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఆమె మాట నిజమైంది

ఇటీవలే ఈ మూవీ డైరెక్టర్ కిరణ్ రావ్ (Kiran Rao) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మన దేశం తరఫున ఈ సినిమా కచ్చితంగా ఆస్కార్‌కు ఎంపికవుతుందని చాలా కాన్ఫిడెంట్గా అన్నారు. ఇప్పుడు ఆమె మాటే నిజమైంది. 2025లో ఆస్కార్‌ అవార్డుల్లో భారత్‌ తరఫున అఫీషియల్ నామినేషన్కు ‘లాపతా లేడీస్‌’ అర్హత సాధిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని కిరణ్ చెప్పారు. ఆస్కార్ వేదిక (laapataa ladies Oscar)పై ఈ సినిమా మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది తనతో పాటు తన టీమ్ మెంబర్స్ కోరిక అని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమా నామినేషన్స్ అనౌన్స్మెంట్ విన్న తర్వాత నెటిజన్లు ఈ టీమ్కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇదీ లాపతా లేడీస్ కథ

పల్లెటూరికి చెందిన ఇద్దరు కొత్త పెళ్లి కూతుర్లు తమ అత్తారింటికి వెళ్లే సమయంలో ఓ రైలు ప్రయాణం (laapataa ladies Story)లో అనుకోకుండా తారుమారైపోతారు. ఇది తెలియని పెళ్లికొడుకులు ఆ అమ్మాయిలను ఇంటికి తీసుకెళ్తారు. తీరా చూశాక అసలు నిజం బయటపడుతుంది. ఈ మార్పు వల్ల ఆ ఇద్దరి అమ్మాయిల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేదే మిగతా కథ. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.

మరోవైపు ఈ సినిమాతంలోనూ టోరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (TIFF) వేడుకలో ప్రదర్శించారు. అంతే కాకుండా సుప్రీంకోర్టు (Supre,e Court) 75 ఏళ్ల వేడుకలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్లోనూ ఈ మూవీ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఇక ‘ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)’ అవార్డుల్లోనూ లాపతా లేడీస్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌ విభాగంలో బెస్ట్‌ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకుంది.

Share post:

లేటెస్ట్