ManaEnadu:యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్, తారక్ అన్న.. ఇలా అభిమానులు ప్రేమగా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ (NTR) లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రోజున హైదరాబాద్ నోవాటెల్‌లో జరగాల్సి ఉండగా అనూహ్యంగా రద్దైంది. అంచనాకు మించి అభిమానులు రావడం వల్ల నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈవెంట్ నిర్వాహకులపై ఫ్యాన్స్ ఫైర్
తమ అభిమాన హీరో నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Devara Pre Release Event)కు ఎంతో ఉత్సాహంగా చేరుకున్న అభిమానులు ఆ కార్యక్రమం రద్దు కావడంతో తీవ్ర నిరాశ చెందారు. నిరుత్సాహంతో బాధతో వెనుదిరిగారు. ఈవెంట్ నిర్వాహకులపై తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈవెంట్ మేనేజర్స్‌పై, హోటల్ యాజమాన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంతో ఆశగా వస్తే నిరాశగా..
అంత పెద్ద హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కనీస ప్లానింగ్ కూడా లేకుండా ఎలా వ్యవహరిస్తారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బడా ఈవెంట్ అని తెలిసినప్పుడు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి కానీ, భద్రతా కారణాల వల్ల ఇలా కార్యక్రమం రద్దు చేయడమేంటని ఫైర్ (NTR Fans) అవుతున్నారు. తమ అభిమాన హీరోను చూసే అవకాశం కోల్పోయామంటూ వాపోతున్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్ కొంటే నిరాశగా వెనుతిరగాల్సి వస్తోందని బాధ పడ్డారు. ఎంతో దూరం నుంచి ఖాళీగా తిరిగి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ భయం వెంటాడుతోంది..
మరోవైపు ఈ ఈవెంట్ రద్దు దేవర (Devara Movie)పై నెగిటివ్ ప్రభావం చూపుతుందేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు బాగా వైరల్ కావడంతో దేవరకు నెగిటివ్ పబ్లిసిటీ వస్తోందని, ఆ ప్రభావం సినిమాపై ఉండకూడదని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan) కొరటాలతో చేసిన ఆచార్య ఎంతటి ఫ్లాప్‌గా పేరు మూటగట్టుకుందో తెలిసిందే. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కూడా కొరటాల శివతో చేస్తున్న దేవరకు కూడా అలాంటి టాక్ వస్తుందేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇంతలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందేమోనని కంగారుపడుతున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ సెప్టెంబరు 27వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవరను రెండు పార్ట్‌లుగా తెరకెక్కించారు. అందులో భాగంగా దేవర-పార్ట్1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో అలరించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీంతంఅందించారు.
We regret being in this situation but are forever grateful to our beloved Man of Masses NTR’s fans. 🙏🏻🙏🏻
The biggest celebration awaits. See you in theatres on Sept 27th.#Devara #DevaraOnSep27th pic.twitter.com/oSXa2ga6Za
— Devara (@DevaraMovie) September 22, 2024
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…