పుష్ప-2 సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ మూవీ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో ఓ ప్రాజెక్టు ఓకే చేశాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజున ఈ మూవీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా కోసమే బన్నీ తరచూ ముంబయికి వెళ్తూ వస్తున్నాడు. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయింది.
బన్నీ-మృణాల్
అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అల్లు అర్జున్-అట్లీ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గురువారం రోజున లుక్ టెస్ట్ కూడా జరిగినట్లు టాక్. ఈ క్రమంలోనే ఆమెను ఈ మూవీలో ఫైనల్ చేసినట్లు తెలిసింది.
ముగ్గురు హీరోయిన్లు
ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. అయితే మృణాల్ మాత్రమే కాదు.. ఆమెతో పాటు ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటించనున్నారట. మరో నటిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor ) ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆ భామతో చర్చలు కూడా జరిపారట. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు దాదాపు ఫైనల్ కాగా.. మూడో నటి ఎవరనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఇక జూన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.






