
సొంతగడ్డపై ముంబై ఇండియన్స్(Mumbai Indians) దుమ్మురేపింది. ఆల్ ప్రదర్శనతో చెలరేగింది. దీంతో ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో జరిగిన మ్యాచులో 9 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. వెటరన్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్‌లోకి వచ్చిన వేళ MI మళ్లీ ప్లేఆఫ్స్(Play offs) రేసులోకి వచ్చింది. సూపర్ కింగ్స్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రికెల్టన్ (24), రోహిత్ శర్మ (45 బంతుల్లో 76*), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68*) చెలరేగడంతో 9 వికెట్ల తేడాతో సూపర్ విజయం సాధించింది.
#Mumbailndians won by 9 wickets ✌🏻💪🏻🥳🎉✨
Raja👑 & SKY #RohitSharma #SuryakumarYadav #TataIPL2025 #MIvsCSK #IPL2025 #IPLpic.twitter.com/rFt8ZlONUg— Ruhi♡ (@SmartDaisy_Duck) April 20, 2025
చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన CSK పరుగులు చేయడానికి తీవ్రంగా కష్టపడింది. ముంబై బౌలర్లు టైట్ బౌలింగ్ చేసి పరుగులు ఇవ్వకుండా.. వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో 20 ఓవర్లలో 176/5 పరుగులకే పరిమితమైంది. రషీద్ (19), ఆయుష్ మాత్రే (32), జడేజా (53*), దూబే (50) మాత్రమే రాణించారు. ధోనీ (4) నిరాశపర్చాడు. ఈ ఓటమితో CSK ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. ముంబై వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో 6వ స్థానికి చేరుకుంది. కాగా నేడు కోల్‌కతా వేదికగా GT vs KKR మ్యాచ్ రాత్రి 7.30గంటలకు జరగనుంది.