IPL-2025లో భాగంగా SRHతో మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ నెగ్గింది. ఈమేరకు MI కెప్టెన్ హార్దిక్ పాండ్య తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో ఇరుజట్లు ఎలాంటి మార్పులు లేకుండానే గత మ్యాచులో ఆడిన జట్లతోనే బరిలోకి దిగాయి. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చెరో రెండు విజయాలను సాధించాయి. ఇరు జట్లు ఆరు ఆరు మ్యాచ్‌లు ఆడి రెండ్రెండు విజయాలను సాధించాయి. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఏడో స్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలను కాస్త మెరుగుపర్చుకుంటుంది.
Toss update: Sunrisers Hyderabad bat first!#MIvSRH #MIvsSRH #SRHvsMI #SRHvMI #MumbaiIndians#SunRiserHydrabad pic.twitter.com/Y5Y6oTk3nu
— Info india (@IndEnfo) April 17, 2025
ఓవరాల్‌గా ముంబైదే పైచేయి
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు 23 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో MI అత్యధికంగా 13 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, SRH 10 మ్యాచ్‌లలో గెలిచింది. వాంఖడే వేదికగా ఈ రెండు జట్లు ఎనిమిది మ్యాచ్‌లు ఆడాయి. వాంఖడేలో ముంబై అత్యధికంగా 6 విజయాలు సాధిస్తే సన్‌రైజర్స్ కేవలం 2 గెలిచింది. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తుది జట్లు ఇవే..
SRH (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (Wk), ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ
MI (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(Wk), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య(C), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ
Mumbai Indians and Sunrisers Hyderabad lineups#MIvSRH #MIvsSRH #SRHvMI #SRHvsMI pic.twitter.com/OSNieLZyjX
— NightWatchMad 🏏 (@NightWatchMad) April 17, 2025






