ఒక ‘అవెంజర్స్‌’.. ఒక ‘బ్యాట్‌మ్యాన్‌’.. ఒక ‘దేవర’.. హాలీవుడ్ రేంజ్ లో తారక్ మూవీ

Mana Enadu : ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఆరేళ్ల తర్వాత తారక్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. గ్లోబల్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ (NTR) .. దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర (Devara)’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపత్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తి నెలకొల్పుతోంది.

హాలీవుడ్ రేంజ్ లో దేవర

అయితే తాజాగా దేవరకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ను ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh) షేర్ చేశాడు. ఈ అప్డేట్ తో దేవరపై హైప్ మరొక్కసారి ఎక్కడికో వెళ్లిపోయింది. దేవర సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని అన్నాడు. ‘దేవర’ (Devara) సినిమా చూస్తున్నప్పుడు మీకు ‘అవెంజర్స్‌’, ‘బ్యాట్‌మ్యాన్‌ (Batman)’ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుందని చెప్పాడు. అభిమానులతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నానని.. తాము ఈ సినిమాను ఎంత ఎంజాయ్‌ చేశామో వారు కూడా అదేస్థాయిలో ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

ఎలా తీశారబ్బా?

‘బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ (Devara Music) అందించే సమయంలో నేను షాకయ్యాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తీశారా అని అనిపించింది. ఇది అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం ఛాలెంజింగ్ గా ఉంటుంది. చాలా ప్రయోగాలు చేయొచ్చు. ఫ్యాన్స్ కు ఫ్రెష్‌ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో 95 శాతం రీరికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేశాం. ఈ చిత్రంలో ఎమోషన్‌, డ్రామా, యాక్షన్‌, ఆవేశం, అన్నీ ఉన్నాయి.’ అని అనిరుధ్ తెలిపాడు.

రేపే రిలీజ్

కొరటాల శివ (Koratala Shiva) రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్‌ 27వ తేదీన పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.  ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించాడు.

Related Posts

బాక్సాఫీస్ వద్ద ‘డాకు మహారాజ్’ హవా.. రూ.150 కోట్లు వసూల్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లతో ఈ…

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు ముగియడంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) వెల్లడించింది. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *