Mana Enadu : ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati).. ఈ రియాల్టీ షో గురించి తెలియని వారుండరు. చాలా మంది తమ లైఫ్ లో ఒక్కసారైనా ఈ షోకు వెళ్లాలనుకుంటారు. ముఖ్యంగా ఈ షో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ను కలవాలి అనుకుంటారు. అయితే ఒక్కసారి హాట్ సీట్ లో కూర్చొని.. అది కూడా ఎదురుగా అమితాబ్ ఉన్నప్పుడు.. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా కొన్నిసార్లు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కానీ ఓ 22 ఏళ్ల కుర్రాడు మాత్రం తన ఇన్స్పిరేషన్ అయిన అమితాబ్ ను చూస్తూ.. ఆయన అడిగే ప్రశ్నలకు ఠక్కుమని సమాధానాలు ఇస్తూ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు.
సీజన్16 ఫస్ట్ విన్నర్
తాజాగా 16వ సీజన్ (KBC Season 16) నడుస్తుండగా.. ఇందులో 22 ఏళ్ల కుర్రాడు చందర్ ప్రకాశ్ (Chander Prakash) కోటి రూపాయలు గెలిచి సంచలనం సృష్టించాడు. ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్ ఇతడే. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినా.. రిస్క్ తీసుకోకుండా కోటి రూపాయలతో గేమ్ నుంచి క్విట్ అయ్యాడు. బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కంటెస్టెంట్ చందర్ ప్రకాశ్ రూ.కోటి ప్రశ్నకు చేరుకున్నాడు.
రూ.కోటి ప్రశ్న ఇదే
‘‘ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ.. ‘శాంతి నివాసం (Shanti Nivasam)’ అనే అరబిక్ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉంది’’ అని అమితాబ్ అడిగిన ప్రశ్నకు.. ఎ. సోమాలియా, బి. ఒమన్, సి. టాంజానియా, డి. బ్రూనై నాలుగు ఆప్షన్లు ఇవ్వగా.. ఇందులో చందర్ ప్రకాశ్ ‘డబుల్ డిప్’ లైఫ్‌లైన్‌ను యూజ్ చేసి ఆప్షన్ సి. టాంజానియా (Tanzania) సరైన సమాధానం ఎంచుకోవడంతో రూ.కోటి గెలుచుకున్నాడు. రూ.కోటితో పాటు ప్రకాస్ ఓ కారును కూడా బహుమతిగా అందుకున్నాడు.
View this post on Instagram
రిస్క్ ఎందుకని క్విట్ అయ్యాడు
ఆ తర్వాత చందర్ ప్రకాశ్ కు బిగ్ బీ రూ.7కోట్ల ప్రశ్న ‘‘1587లో ఉత్తర అమెరికా (North Korea)లో ఇంగ్లీష్ దంపతులను జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?’’ అని ప్రశ్న వేయగా.. దీనికి సమాధానం తెలియని ప్రకాశ్‌కు లైఫ్ లైన్లు కూడా అయిపోవడంతో తప్పనిపరిస్థితుల్లో షో నుంచి క్విట్ అయ్యాడు. ఆ తర్వాత అమితాబ్ ఆ ప్రశ్నకు సమాధానం గెస్ చేయమని అడగ్గా.. ప్రకాశ్ ఆప్షన్ ఎ. వర్జనీయా డేర్ అని చెప్పాడు. అదే సరైన జవాబు అని బిగ్‌బీ (Big B) తెలిపడంతో రూ.ఏడు కోట్లు మిస్ అయ్యాడని అందరూ అంటున్నారు. కానీ సమాధానం తప్పయితే ఉన్న రూ.కోటి కూడా పోయుండేదని నెటిజన్లు చెబుతున్నారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…