Special Buses : ప్రయాణికులకు APSRTC దసరా బొనాంజా

Mana Enadu : దసరా పండుగ వచ్చేస్తోంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం(Vijayawada Kanakadurgamma Temple)లో శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. అక్టోబర్​ 3 నుంచి 15వ తేదీ వరకు 13 రోజులపాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు విజయవాడలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మరోవైపు పాఠశాలలు​, కళాశాలలకు పండుగ సెలవులు (Dussehra Holidays) కూడా అప్పుడే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగం కోసం సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్లిన వారంతా తిరిగి ఊళ్లకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజులపాటు ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ (Hyderabad)కు అత్యధికంగా 353 బస్సులు, ఆ తర్వాత రాజమహేంద్రవరం రూట్​లో తొలి మూడు రోజులు 37 సర్వీసులు చొప్పున నడపనున్నారు. మూలా నక్షత్రమైన అక్టోబర్​ 9వ తేదీన  అమ్మవారి దర్శనానికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు వస్తారని  అంచనా వేస్తున్న అధికారులు అక్టోబర్​ 8వ తేదీ నుంచి బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచనున్నారు. అక్టోబర్​ 9న హైదరాబాద్ – విజయవాడ మధ్య 105 బస్సులు, 10వ తేదీన 117 బస్సులు, 11న 128 బస్సులు ప్రత్యేకంగా నడపనున్నారు. పండుగ తర్వాత రోజు అక్టోబర్​ 13న 128 బస్సులు, 14న 103 బస్సులు నడపాలని నిర్ణయించారు.

Share post:

లేటెస్ట్