Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ నిశ్చితార్థం ఆగస్టులో జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరి పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. వాటికి సంబంధించి శోభిత తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలు కూడా షేర్ చేసింది. అయితే వీరి పెళ్లి ఎప్పుడనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.
డిసెంబర్ 4న పెళ్లి
అయితే తాజాగా నాగ చైతన్య శోభితా (Shobita Dhulipala) పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబరు నెలలో ఈ జంట ఒక్కటి కానున్నట్లు సమాచారం. డిసెంబరు 4వ తేదీన వీరి వివాహం జరగనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్
2వ తేదీన సంగీత్, 3న మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. ఇక 10వ తేదీన గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఉంటుందట. పెళ్లి తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే చై-శోభితాల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ కానుందట. ఇందుకోసం వీరు రాజస్థాన్ ను ఎంచుకున్నారట.
ఇక వీళ్ల సినిమాల సంగతికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్‌లో ‘తండేల్ (Thandel)’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైకి జంటగా సాయి పల్లవి కనిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. ఇటీవలే లవ్ సితార
అనే సినిమాతో ప్రేక్షకులకు వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.






