పెళ్లి కూతురుగా ముస్తాబైన శోభిత.. ఫొటోలు వైరల్‌

Mana Enadu : నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala), టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ జంట మరో రెండు రోజుల్లో బ్యాచిలర్‌ జీవితానికి గుడ్‌ బై చెప్పనుంది. బుధవారం రోజున వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి.

పెళ్లికూతురిగా శోభిత

ఇటీవల కాబోయే వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. తాజాగా శోభితను సోమవారం రోజున పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసి మంగళ హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత (Shobita Marriage) తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె సంప్రదాయంగా ఎరుపు రంగు చీర కట్టులో మెరిసిపోయింది. సిగ్గులొలుకుతూ ఫొటోలకు పోజులిచ్చింది. పెళ్లి కూతురు అంటూ క్యాప్షన్ కూడా యాడ్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)

శోభిత ఫొటోలు వైరల్

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో శోభితా (Shobita Photos) పదహారణాల తెలుగమ్మాయిలా చాలా అందంగా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కంగ్రాట్స్ బ్యూటీ అంటూ మరికొందరు విషెస్ చెబుతున్నారు. ఆల్ ది బెస్ట్ టూ న్యూ చాప్టర్ అంటూ ఇంకొందరు తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. 

మరో రెండ్రోజుల్లో వివాహం

 నాగచైతన్య-శోభితా ధూళిపాళ నిశ్చితార్థం ఆగస్టులో జరిగిన విషయం తెలిసిందే. డిసెంబరు 4వ తేదీన హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా వీరి వివాహం (Shobita Naga Chaitanya Marriage) జరగనుంది. కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ ప్రేముఖులు కూడా ఈ వివాహానికి హాజరు కానున్నారు. శోభిత తెలుగులో గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇక నాగచైతన్య నటించిన తండేల్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *