Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి (డిసెంబరు 30) వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede Case)లో నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో ఆయన వర్చువల్‌గా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
హైకోర్టు మధ్యంతర బెయిల్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబరు 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్ షో (Pushpa 2 Benefit Show) సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో ఇటీవల అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది. ఈ క్రమంలో ఆయన మరుసటి రోజు ఉదయమే జైలు నుంచి విడుదలయ్యారు.
జనవరి 10న విచారణ
అయితే నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ (Allu Arjun Remand) ఇవాళ్టితో పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టు ముందు వర్చువల్ గా హాజరయ్యారు. పోలీసులు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. ఈ క్రమంలోనే కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్ రిమాండ్‌పైనా విచారణ ఆ రోజే జరగనుంది.







