నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ మూవీతో సందడి చేయనున్నారు. జనవరి 12వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై హైప్ పెంచేశాయి.
ఆంధ్రాలో డాకు మేనియా
ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ (Daaku Maharaaj Promotions)లో స్పీడు పెంచింది. ఇప్పటికే అమెరికా డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆంధ్రాలోనూ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ప్లేస్ అండ్ డేట్ ఫిక్స్ చేశారు. మరి ఈ కార్యక్రమానికి గెస్టుగా ఎవరు వస్తున్నారంటే..
ఒకే వేదికపై మామా అల్లుడు
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Daaku Maharaaj Pre Release Event) ను జనవరి 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు అనంతపురంలో గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్కు ఏపీ మంత్రి, బాలయ్య బాబు అల్లుడు నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం. ఇక అనంతపురంలో మామాఅల్లుళ్లు స్టేజిపై ఎంత రచ్చ చేస్తారో చూడాలి. ఈ ఈవెంట్ కోసం బాలయ్య ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






