9న డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ మూవీతో సందడి చేయనున్నారు. జనవరి 12వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై హైప్ పెంచేశాయి.

ఆంధ్రాలో డాకు మేనియా

ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ (Daaku Maharaaj Promotions)లో స్పీడు పెంచింది. ఇప్పటికే అమెరికా డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆంధ్రాలోనూ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ప్లేస్ అండ్ డేట్ ఫిక్స్ చేశారు. మరి ఈ కార్యక్రమానికి గెస్టుగా ఎవరు వస్తున్నారంటే..

ఒకే వేదికపై మామా అల్లుడు

‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Daaku Maharaaj Pre Release Event) ను జనవరి 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు అనంతపురంలో గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు ఏపీ మంత్రి, బాలయ్య బాబు అల్లుడు నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం. ఇక అనంతపురంలో మామాఅల్లుళ్లు స్టేజిపై ఎంత రచ్చ చేస్తారో చూడాలి. ఈ ఈవెంట్ కోసం బాలయ్య ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *