మన ఈనాడు:
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒకవైపు..నర్సంపేటలో జరుగుతున్న ఎన్నికలు మరోవైపు..కమ్యూనిస్టు భావజాలంతో నిండుకున్న ప్రాంతం. అక్కడి ప్రజలు చైతన్యవంతులు. అభివృద్ధి పనులతో..అందుబాటులో ఉండే నేతలకే పట్టం కడుతూ వస్తున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే (MLA) పెద్ద సుదర్శన్‌రెడ్డి పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ నుంచి దొంతి మాధవ్రెడ్డికే టిక్కెట్ ఖారారు కావడంతో ప్రచారం ఊపుందుకుంది.
2014లో జరిగిన ఎన్నికల్లో దొంతి మాధవ్‌రెడ్డి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆతర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దొంతిపై పెద్ది విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు రాజకీయాలు వాడీవేడిగానే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సైతం బలంగానే ఉండటంతో అధికారపార్టీకి గుబులు పట్టుకుంది.
గులాబీ నేతలు మాత్రం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధే మరోసారి అధికారంలోకి తీసుకొస్తుందని ధైర్యంగా ఉన్నారు. 6గ్యారంటీలతో హస్తం(Congress) నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొంటున్నారు.
నెక్కొండ, చెన్నారావుపేట, దుగ్గొండి, నర్సంపేట,నల్లబెల్లి, ఖానాపురం మండలాలు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నాయి. గులాబీ నాయకులు ఎదురుగా ధైర్యంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ స్పీడ్, ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేఖతను చూసి ఆందోళన చెందుతున్నారు. ఈసారి నర్సంపేట ప్రజలు దొంతితో కలిసి ’చేతులు‘ కలపనున్నట్లు తెలుస్తుంది.