రూ.99లకే సినిమా టికెట్.. ఆ ఒక్క రోజే బంపర్ ఆఫర్

ManaEnadu : సినిమా లవర్స్​కు ఓ సూపర్ గుడ్ న్యూస్. కేవలం 99 రూపాయలకే మల్టీప్లెక్స్(Multiplex) ​లో మీరు సినిమా చూసేయచ్చు. అంత తక్కువ ధరకు టికెట్​ వస్తుందా? అది కూడా మల్టీప్లెక్స్​లో అని ఆశ్చర్యపోకండి. నిజంగానే రూ.99లకే మీరు సినిమా చూసేయచ్చు. కానీ ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఒక్కరోజు మాత్రమే. అసలు ఈ ఆఫర్ ఏంటి? ఆ ఒక్క రోజు ఎప్పుడు? ఎందుకీ స్పెషల్ ఆఫర్? ఈ వివరాలు తెలుసుకుందాం రండి.

4వేలకు పైగా స్క్రీన్లలో

సెప్టెంబర్ 20వ తేదీన జాతీయ సినిమా దినోత్సవం (National Cinema Day). ఈ సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) సినీ ప్రియులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమాను మల్టీఫ్లెక్స్‌లో చూడొచ్చని తెలిపింది. సెప్టెంబర్‌ 20వ తేదీనన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోని 4 వేలకు పైగా మల్టీప్లెక్స్​ స్క్రీన్లలో కేవలం 99 రూపాయలకే సినిమా (Cinema)ను వీక్షించొచ్చని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ 3D, రెక్లైనర్లు, ప్రీమియం ఫార్మాట్‌ స్క్రీన్లకు వర్తించదు. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ శుక్రవారం మీకు నచ్చిన సినిమా చూసేందుకు టికెట్‌ బుక్‌ చేసుకోండి.

ఒక లాగిన్​పై ఆరు టికెట్లు

ఈ సందర్భంగా PVR INOX, CINE POLIS, MIRAZ మూవీటైమ్, డిలైట్‌ మల్టీప్లెక్స్‌లు 4000పైగా స్క్రీన్‌లను రెడీ చేస్తున్నాయి. సెప్టెంబరు 20న విడుదల కానున్న ‘యుధ్రా’, ‘కహా షురూ కహా ఖతం’, గత నెలలో విడుదలై బాక్సాఫీసు వద్ద జోరుమీదున్న ‘స్త్రీ 2 (Stree 2)’,  ఇటీవల రీ రిలీజ్‌ అయిన ‘తుంబాడ్‌’, ‘వీర్‌ జారా’ లాంటి సినిమాలను రూ.99లకే చూడొచ్చన్నమాట. ఈ ఆఫర్‌ ఆరోజు ప్రదర్శించే అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుంది. ఒక లాగిన్‌పై ఆరు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని ఎంఏఐ తెలిపింది.

ఆన్​లైన్​లోనూ బుకింగ్

99 రూపాయల టిక్కెట్‌ ఆఫర్‌ (Ticket Offer)ను పొందడానికి ఆన్‌లైన్‌లో అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లోని సినిమా బుకింగ్‌ సైట్స్‌లోకి వెళ్లి మీ లొకేషన్‌ని ఎంచుకుని, సెప్టెంబర్ 20వ తేదీని సెలక్ట్‌ చేసి ఆరోజు మీరు చూడాలనుకుంటున్న సినిమా పేరును ఎంచుకుని బుక్ యువర్ టికెట్ ఆప్షన్‌ క్లిక్ చేసి మీ సీటు రిజర్వ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు బుక్ చేసుకున్న టికెట్​కు నగదు చెల్లిస్తే సరి. ఆన్‌లైన్‌లోనే కాకుండా సినిమా థియేటర్‌, మల్టీప్లెక్స్‌కు నేరుగా వెళ్లి కూడా 99 రూపాయలకు టికెట్‌ కొనుగోలు చేసి సినిమా చూడొచ్చు.

Share post:

లేటెస్ట్