Mana Enadu : తెలంగాణలో కుల గణన ప్రక్రియ (Cast Census Telangana)కు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి సారిగా మన రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజున రాష్ట్రానికి రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. కులగణన తర్వాత ఏయే సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు కేటాయించాలో పూర్తి క్లారిటీ వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
60 ప్రశ్నలకు మీ సమాధానాలు
అయితే కులగణన సమయంలో అధికారులు దాదాపు 60 ప్రశ్నలు అడగనున్నారు. వాటిలో ముఖ్యంగా.. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు(Political Leaders) పొందారా? ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారా?, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, ఎలా ఉపాధి పొందుతున్నారు? భూమి ఉందా? ఏడాదికి కుటుంబ ఆదాయం ఎంత వస్తుంది? వంటి ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించనున్నారు. వీటిలో సగం కుటుంబ నేపథ్యంపైనే ఉండనున్నాయి. మిగిలినవి వ్యక్తిగత వివరాలు.
బీసీ కులాల కోసమే కులగణన
బీసీ కులాల వివరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. బీసీ కులాల(BC Cast) వారితో పాటు రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరి కులం, ఉప కులం ఏంటి? స్థానికంగా కులాల పేర్లలో ఏమైనా మార్పులున్నాయా ? వంటి వివరాలన్నీ ఈ ప్రక్రియలో సేకరించనున్నారు. తప్పుడు వివరాలు నమోదు కాకుండా స్థానిక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలో కులగణనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.
త్వరలోనే అఖిలపక్ష సమావేశం
త్వరలో దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాంచనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడనుందని వెల్లడించారు. రాహుల్ గాంధీ సూచన మేరకే ఈ సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ జరిపిన తర్వాత భవిష్యత్ లో దేశమంతా తెలంగాణను అనుసరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






