తెలంగాణ(Telangana)లోని మందుబాబులకు గుడ్‌న్యూస్ రానుంది. రాష్ట్ర మద్యం మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు 92 కంపెనీలకు చెందిన 604 కొత్త బ్రాండ్లు(New liquor brands) ఉవ్విళ్లూరుతున్నాయి. సర్కార్(Govt) నిర్దేశించిన గడువులోగా తమ బ్రాండ్లను తెలంగాణలో విక్రయిస్తామని ఆ కంపెనీ(Liquor Companies)లు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 331 ఇండియన్ మేడ్ లిక్కర్ బ్రాండ్లు, మరో 273 రకాల విదేశీ లిక్కర్ బ్రాండ్లు(Foreign liquor brands) ఉన్నాయి. దేశ, విదేశీ మద్యం బ్రాండ్ల కోసం TGBCL ఈ ఏడాది ఫిబ్రవరి 23న దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
సిద్ధంగా 47 కొత్త కంపెనీలు
ఆ నోటిఫికేషన్(Notification) మేరకు ఇప్పటికే మద్యం సరఫరా చేస్తున్న 45 కంపెనీలు 218 కొత్త రకాల మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. తెలంగాణలో తొలిసారి 386 రకాల కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు 47 కొత్త కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. కాగా లిక్కర్ కంపెనీల నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ(Excise Department) తెలిపింది. కానీ ఆ తర్వాత గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించింది.
దీంతో ఏప్రిల్ 2 వరకు 92 కంపెనీల నుంచి 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. కాగా ఈ దరఖాస్తుల పరిశీలన(Scrutiny of applications) అనంతరం ప్రభుత్వ ఆమోదం మేరకు కొత్త బ్రాండ్లు(New Brands) అందుబాటులోకి రానున్నాయి.






