భారత ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్ కా షాన్ సిరాజ్ కొత్త రికార్డు సృష్టించారు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన రికార్డును ఆదివారం ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ మియా సాధించాడు. ఇలా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ మియానే కావడం విశేషం. ఈ మ్యాచులో ఇప్పటివరకు ఆరు వికెట్లు తీసిన సిరాజ్ శ్రీలంకపై తన వేట కొనసాగిస్తున్నాడు. వన్డే మ్యాచులో అత్యంత వేగంగా 5 వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ చమిందా వాస్ రికార్డును సైతం సిరాజ్ సమం చేశాడు.
BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి
పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…








