Mana Enadu : అంతర్జాతీయ క్రికెట్ మండలి(International Cricket Council) న్యూజిలాండ్(New Zealand) క్రికెట్ జట్టుకు ఓ ఝలక్ ఇచ్చింది. క్రైస్ట్‌చర్చ్(Christchurch) వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్(Test)లో స్లో ఓవర్ రేట్‌కు(Slow over rate)గాను ఇరుజట్లకు మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోతతోపాటు మూడు డబ్ల్యూటీసీ పాయింట్ల(WTC points) కోత విధించింది. దీంతో న్యూజిలాండ్ WTC ఫైనల్‌కు చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి. తాజా పెనాల్టీ అనంతరం WTC పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(Nz) 5వ స్థానానికి పడిపోయింది. శ్రీలంక(Srilanka) నాలుగో స్థానంలో ఉంది. భారత్ టాప్‌లో ఉండగా.. సౌతాఫ్రికా రెండు, ఆస్ట్రేలియా మూడోస్థానంలో కొనసాగుతోంది.
ఆ రెండు మ్యాచుల్లో నెగ్గినా కష్టమే
ఇంగ్లండ్(England)తో జరిగే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచినా WTC ఫైనల్‌కు చేరడం కష్టమే. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పర్సెంటేజీ(PTC) 47.92గా ఉంది. ఇంగ్లండ్‌తో చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా న్యూజిలాండ్ పాయింట్ల పర్సెంటేజీ 55.36 శాతం వరకు మాత్రమే చేరుకుంటుంది. ఇక క్రైస్ట్‌చర్చ్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8వికెట్ల తేడాతో గెలుపొందింది. కేవలం 4 రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ మొదలుకానుంది.
England and New Zealand have been fined 15% of their match fees and docked 3 WTC Points. pic.twitter.com/I60RceBFNk
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2024
ఉత్కంఠగా WTC ఫైనల్ రేస్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(World Test Championship Final) రేసు చాలా ఉత్కంఠగా మారింది. భారత్‌తో సహా కొన్ని జట్లు ఇప్పటికీ రేసులో నిలిచాయి. ఆస్ట్రేలియాలో విజయంతో ఆరంభించి తన స్థానాన్ని మెరుగుపరుచుకున్న టీమ్‌ఇండియా(Team India) ఇప్పుడు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టులో మరింత పటిష్టం చేసుకోవాలనుకుంటోంది. అయితే, ఈ టెస్టుకు ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) రెండు జట్లపై చర్యలు తీసుకుని ఈ రెండు జట్లకు రెట్టింపు శిక్ష విధించింది. కాగా భారత గడ్డపై టీమ్ ఇండియాను 3-0తో న్యూజిలాండ్ ఓడించిన విషయం తెలిసిందే.