మన ఈనాడుః నాచురల్ స్టార్ నాని (Nani) ఈ యేడాది ‘దసరా’ (Dasara) సినిమాతో పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో నాని తన 30వ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యవ్‌తో చేస్తున్నారు. ఈ సినిమాకు ‘హాయ్ నాన్న’ (Hi Nanna) అనే టైటిల్ ఖరారు చేశారు. జెర్సీ తర్వాత మరోసారి ఏమోషనల్ టచ్ ఉన్న సబ్జెక్ట్‌తో నాని రానున్నట్లు తెలుస్తోంది. జెర్సీలో తండ్రీ తనయులు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కితే.. ఇపుడు చేస్తోన్న ‘హాయ్ నాన్న’ మాత్రం తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో తెరకెక్కింది. ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ కూడా ఎంతో ఎమోషన్‌లతో కూడి ఉంది. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి లేటస్ట్ గా ట్రైలర్ రిలీజ్ డేట్ పై అప్ డేట్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ ని అయితే ఈ నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
ఇప్పటికే విడుదలైన హాయ్ నాన్ టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. క్లీన్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉంది. నాని సూపర్ కూల్ లుక్‌లో అదరగొట్టాడు. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో (Mrunal Thakur) నాని కెమిస్ట్రీ కూడా బాగుంది. టీజర్‌ను బట్టి చూస్తే.. మొత్తంగా నాని తనకు పర్ఫెక్ట్‌గా సూటయ్యే సబ్జెక్ట్‌తో వస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో రాబోతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 07న గ్రాండ్‌గా విడుదలకానున్న నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా పాటలను విడుదల చేస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. దసరా మూవీ తర్వాత వస్తుండడంతో మంచి అంచనాలనున్నాయి. ఈ సినిమా ఆడియో పాన్ ఇండియా హక్కులు దిగ్గజ ఆడియో సంస్థ టీ సిరీస్ దక్కించుకుంది. మొత్తంగా అన్ని భాషాల్లో కలిపి ఈ ఆడియో రైట్స్‌కు 9 కోట్ల వరకు ధర పలికిందని తెలుస్తోంది.
మరోవైపు హాయ్ నాన్న నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు చెందిన శాటీలైట్ రైట్స్‌ను జెమినీ టీవీ భారీ (Hi Nanna satellite rights acquired by Gemini ) ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హాయ్ నాన్న రైట్స్‌ను జెమినీ టీవీ ఏడు కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను మొదట డిసెంబర్ 22కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సలార్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాను డిసెంబర్ 7 కి ప్రీపోన్ చేశారు.
news/movies/nani-hi-nanna-movie-trailer-release-date-fix-sb