భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ఉపగ్రహం రేపు (జులై 30) నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం 5:40 గంటలకు (భారత కాలమానం) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F16 రాకెట్ ద్వారా 2,392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ISRO సిద్ధమైంది. మూడు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేసి ప్రయోగవేదికకు తరలించి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం 5:30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
భూమి సీక్రెట్స్‌ను కనిపెడుతుంది..
NISAR ఉపగ్రహం, భూమిని అత్యంత కచ్చితంగా పరిశీలించేందుకు రూపొందించిన మొట్టమొదటి ద్వంద్వ-ఫ్రీక్వెన్సీ(Dual Frequency) రాడార్ ఉపగ్రహం. ఇది నాసా అందించిన L-బ్యాండ్, ISRO అభివృద్ధి చేసిన S-బ్యాండ్ రాడార్‌లను కలిగి ఉంది. 12 మీటర్ల విస్తృతి గల డిప్లాయబుల్ మెష్ యాంటెన్నాతో, ఇది 242KM వెడల్పు గల స్వాత్‌ను అత్యంత కచ్చితత్వంతో పరిశీలిస్తుంది. ఈ ఉపగ్రహం భూమి ఉపరితల మార్పులను, హిమానీనదాల కదలికలను, సముద్ర మట్టాల పెరుగుదలను, భూగర్భ జలాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూస్ఖలనాల వంటి సహజ విపత్తులను పర్యవేక్షిస్తుంది.
భారత్-అమెరికా మధ్య అంతరిక్ష బంధం బలోపేతం
ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు భూమిని పూర్తిగా మ్యాప్ చేస్తూ, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ, రాత్రి-పగలు డేటాను అందిస్తుంది. దీని డేటా సైంటిస్టులకు, పర్యావరణ పరిశోధకులకు, విధాన రూపకర్తలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయోగం భారత్, US మధ్య అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రోజు నుంచి ప్రారంభమైన కౌంట్‌డౌన్‌తో, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అంతరిక్ష ఔత్సాహికులు ఈ చారిత్రాత్మక క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
NISAR is mounted. GSLV-F16 systems checked. Liftoff in 2 days!
Join us LIVE as GSLV-F16 lifts NISAR into orbit.🗓️ July 30, 2025
Live from: 17:10 Hours
Liftoff at : 17:40 HoursLink: https://t.co/flWew2LhgQ
For more information:https://t.co/XkS3v3M32u#NISAR #GSLVF16 #ISRO… pic.twitter.com/NIlt9dfHMe
— ISRO (@isro) July 28, 2025






