
హీరో నితిన్(Nitin), అందాల భామ శ్రీలీల(Sreelaala) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్(Rabinhood). చలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ మీద అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ మూవీ మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మిక్సిక్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించాడు. అటు కేతిక శర్మ(Kethika Sharma) ఐటెం సాంగ్ కుర్రకారును తెగ ఆకట్టుకుంది.
మే 10 నుంచి ఈ చిత్రం జీ5లో..
ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త టీటౌన్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్ రన్‌ని కూడా పూర్తి చేసుకుంది. దీంతో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్(OTT Release) డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.. ఈ సినిమా OTT రైట్స్ ZEE5 సంస్థ కొనుగోలు చేయగా శాటిలైట్ రైట్స్ ZEE తెలుగు దక్కించుకుందట. కాగా మే 10 నుంచి ఈ చిత్రం జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ రేటుకు తెలుగు రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.