ఉప్ప‌ల్ క్రికెట్‌ మ్యాచ్‌కు ప్రేక్ష‌కుల‌కు నో ఎంట్రీ

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రపంచ కప్ – 2023 మ్యాచ్ నిర్వాహకులు BCCI అధికారులు మరియు HCA అధికారులతో గౌరవ రాచకొండ పోలీసు కమిషనర్ గారు ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రతిష్టాత్మకమైనవి కాబట్టి ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ స్థాయిలో క్రీడాభిమానులు ప్రేక్షకులు మ్యాచ్లను వీక్షించడానికి వచ్చే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.
29 న జరిగే వార్మప్ మ్యాచ్ కు ప్లేయర్స్ మరియు బీసీసీఐ/ ఐసీసీ అధికారులు తప్ప ప్రేక్షకులను ఎవరినీ అనుమతించటం లేదని ఈ విషయాన్ని అందరూ గుర్తించి పోలీసు వారికి సహకరించ వలసిందిగా కోరడమైనది.
ఈ సమావేశంలో Rtd DGP CRPF దుర్గా ప్రసాద్, ఐపిఎస్.,DCP అభిషేక్ మహంతి,ఐపిఎస్., SOT డీసీపీ 1 గిరిధర్, ఐపిఎస్., డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రీబాల, ACP నరేష్ రెడ్డి, ACP ట్రాఫిక్ శ్రీనివాస్, ఉప్పల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మరియు BCCI అధికారులు మరియు HCA అధికారులు, DNA కంపెనీ సిబ్బంది, బుక్ మై షో ప్రతినిధులు పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్